తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ ప్లేఆఫ్​ మ్యాచ్​ల సమయాల్లో మార్పు!

ఐపీఎల్​ తుది అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే 11 మ్యాచ్​లు పూర్తిచేసుకున్నాయి అన్ని జట్లు. అయితే, ప్లే ఆఫ్​ మ్యాచ్​ల సమయాల్లో బీసీసీఐ మార్పు చేసే అవకాశం ఉంది.

ఐపీఎల్​ ప్లేఆఫ్​ మ్యాచ్​ల టైమింగ్​ మార్పు

By

Published : Apr 27, 2019, 10:04 PM IST

ఐపీఎల్​ ప్లేఆఫ్​ మ్యాచ్​లు మే 7వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం సాయంత్రం 8గంటలకు ఆట ఆరంభమవుతుండగా...ప్లే ఆఫ్​ మ్యాచ్​లు ​సాయంత్రం 7గంటల 30 నిముషాలకే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్​లో చాలా ఆటలు ఆలస్యంగా ముగుస్తున్నాయి. మ్యాచ్​లు అర్ధరాత్రి వరకు జరగడంపై అభిమానుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ కారణంతో ఈ ఆలోచన చేస్తోంది పరిశీలిస్తోంది బీసీసీఐ.

ఇటీవల కెప్టెన్​లు రోహిత్​శర్మ, రహానే, అశ్విన్​, కోహ్లి స్లో ఓవర్​ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్నారు.

  1. 12వ సీజన్​ ఐపీఎల్​ క్వాలిఫయర్​ మ్యాచ్​... మే 7న చెన్నైలో జరగనుంది. ఎలిమినేటర్​ మే 8న, క్వాలిఫయర్​-2 మే 10న విశాఖపట్నం​లో జరగనున్నాయి.
  2. మే 12న జరగనున్న ఫైనల్​ మ్యాచ్​కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుంది.

ABOUT THE AUTHOR

...view details