కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ ఓ పాత ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. యువతకు ప్రేరణ కలిగిస్తూ పెట్టిన ఆ ఫొటోను నెటిజన్లతో పంచుకున్నాడు.
ఫొటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎర్రటి దుస్తుల్లో స్కూల్ పిల్లాడిలా గేల్ పక్కన నిల్చున్నాడు కరన్. ప్రస్తుతం అదే ఎరుపు రంగు జెర్సీతో ఇద్దరూ కలిసి పంజాబ్ తరఫున ఆడుతున్నారు.
- ఐపీఎల్లో దిల్లీ, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్.. పంజాబ్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనికి కారణం కరన్ వేసిన అద్భుతమైన స్పెల్. అంతేకాకుండా హ్యాట్రిక్ వికెట్లు తీసి ఈ ఘనత సాధించిన యువ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.