తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ముంబయి నుంచి పైసా తీసుకోలేదు' - cricket

రెండు పదవులు చేపట్టారన్న ఫిర్యాదుపై స్పందించారు సచిన్ తెందుల్కర్​. ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ నుంచి తాను ఎలాంటి లబ్ధి పొందలేదని మాస్టర్ బీసీసీఐ అంబుడ్స్​మన్​కు లేఖ రాశారు.

సచిన్

By

Published : Apr 28, 2019, 4:47 PM IST

ముంబయి ఇండియన్స్​ తరపున తాను ఏ పదవీ చేపట్టలేదని, ఎలాంటి లబ్ధి పొందలేదని సచిన్ తెందుల్కర్ బీసీసీఐ అంబుడ్స్​మన్​కు లేఖ రాశారు. అవసరమైతే వ్యక్తిగత విచారణకు హాజరవుతానని తెలిపారు. జోడు పదవులు చేపట్టారన్న ఫిర్యాదుపై నేడు అంబుడ్స్​మన్​కు 14 పాయింట్ల నివేదిక సమర్పించారు సచిన్.

లేఖలో ఏముందంటే...

"అభియోగం మోపబడిన వ్యక్తి(సచిన్​) ముంబయి ఫ్రాంచైజీ తరపున ఏ పదవీ చేపట్టలేదు. ఎలాంటి ధనరూపక లబ్ది పొందలేదు. జట్టులో అతడి పాత్ర చాలా పరిమితం. బీసీసీఐ నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించలేదు " అని అంబుడ్స్​మన్​కు రాసిన లేఖలో తనను తానుద్దేశిస్తూ సచిన్​ పేర్కొన్నారు.

బీసీసీఐ సలహా మండలి సభ్యుడిగా ఉంటూ ముంబయి ఇండియన్స్​ మెంటర్​గా కొనసాగుతున్నారని, రెండు పదవులు చేపట్టారని సచిన్​పై మధ్యప్రదేశ్ క్రికెట్​ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్​ గుప్తా అంబుడ్స్​మెన్​కు ఫిర్యాదు చేశారు. మాస్టర్​తో పాటు సన్​రైజర్స్​ మెంటర్​ లక్ష్మణ్​పైనా.. అభియోగం మోపారు.

2015లో బీసీసీఐ సలహా మండలి సభ్యుడిగా నియమితుడయ్యారు సచిన్​. 2013లో క్రికెట్​ నుంచి రిటైర్మెంట్​ తీసుకున్నప్పటి నుంచి ముంబయి ఇండియన్స్​ మెంటర్​గా వ్యవహరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details