తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ రనౌటే మ్యాచ్​ను మలుపు తిప్పింది : సచిన్​ - మ్యాచ్

ఫైనల్​లో ధోనీ రనౌటే మ్యాచ్​ను మలుపు తిప్పిందని క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందుల్కర్​ అభిప్రాయపడ్డారు. కీలక సమయాల్లో రోహిత్ మంచి నిర్ణయాలు తీసుకున్నాడని కితాబిచ్చాడు ముంబయి ఇండియన్స్​ కోచ్​ మహేల జయవర్ధనే.

సచిన్

By

Published : May 13, 2019, 2:27 AM IST

Updated : May 13, 2019, 7:46 AM IST

చెన్నై - ముంబయి మధ్య జరిగిన ఐపీఎల్​ ఫైనల్​పై క్రికెట్​ దిగ్గజం సచిన్, ముంబయి కోచ్​ జయవర్ధనే తమ అభిప్రాయలను తెలిపారు. ధోనీ రనౌటే మ్యాచ్​ను​ మలుపు తిప్పిందని క్రికెట్ దిగ్గజం, ముంబయి ఇండియన్స్​ మెంటార్​ సచిన్ తెందూల్కర్​ అభిప్రాయపడ్డారు. చివరి​ ఓవర్లలో అనుభవజ్ఞులకు బౌలింగ్​ ఇచ్చి రోహిత్ మంచి నిర్ణయాలు తీసుకున్నాడని ముంబయి కోచ్​ జయవర్ధనేఅన్నాడు.

"ధోనీ రనౌటే మ్యాచ్​ను మలుపు తిప్పింది. మలింగ 16 ఓవర్లో ధారాళంగా పరుగులిచ్చినా.. చివర్లో అద్భుతంగా వేశాడు. బుమ్రా చక్కటి ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండేళ్ల క్రితం 129 పరుగులను కాపాడుకోగలిగాం.. అందుకే విజయంపై ముందు నుంచి ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాం" -సచిన్ తెందూల్కర్​, ముంబయి మెంటార్

"ధోనీని మేం త్వరగానే పెవిలియన్​కు పంపగలిగాం. కానీ వాట్సన్​ తన హిట్టింగ్​తో మ్యాచ్​ను దూరం చేసే ప్రయత్నం చేశాడు. అలాంటి సమయంలో రోహిత్​ డెత్ ఓవర్లలో అనుభవజ్ఞులకు బౌలింగ్ ఇచ్చి మంచి నిర్ణయాలు తీసుకున్నాడు" - మహేల జయవర్ధనే, ముంబయి కోచ్​

ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్​ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో చెన్నైపై గెలిచింది. ఈ విజయంతో రోహిత్​సేన నాలుగోసారి ఐపీఎల్​ టైటిల్​ నెగ్గింది. బుమ్రా రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

Last Updated : May 13, 2019, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details