ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. వరుస ఓటముల నుంచి బయటపడి విజయాన్ని దక్కించుకోవాలని కోల్‌కతా పట్టుదలగా ఉంది. మరి ఈ రెండు జట్లలో విజయం ఎవరి సొంతం కానుందో చూడాలి.
రాజస్థాన్ రాయల్స్ గెలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. గత మ్యాచ్‌లో రహానే సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. పాయింట్ల పట్టికలో దిగువన ఉంది రాజస్థాన్. మెరుగైన ప్రదర్శన చేసి ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ రేసులో నిలవాలని భావిస్తోంది. రసెల్‌పైనే ప్రధానంగా అందరి దృష్టి నెలకొంది.
జట్లు
రాజస్థాన్ రాయల్స్
స్టీవ్ స్మిత్(కెప్టెన్),అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, వరుణ్ ఆరోన్, సంజూ శాంసన్, స్టువర్ట్ బిన్ని, శ్రేయస్ గోపాల్, ఉనాద్కత్, రియాన్ పరాగ్, ఒషానో థామస్
కోల్‌కతా నైట్‌రైడర్స్
దినేశ్ కార్తీక్(కెప్టెన్), క్రిస్‌లిన్, శుభ్‌మన్ గిల్, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, పీయూష్ చావ్లా, రింకూ సింగ్, నితీశ్ రాణా, ప్రసిధ్ క్రష్ణ, యర్రా పృథ్వీరాజ్, కార్లోస్ బ్రాత్‌వైట్