ఐపీఎల్లో యువ క్రికెటర్ రియాన్ పరాగ్.. అరంగేట్ర సీజన్లోనే తన పేరిట రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం దిల్లీతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసి.. అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం పరాగ్ వయసు 17 సంవత్సరాల 175 రోజులు.
ఐపీఎల్ 'చిన్నోడు' రికార్డు నెలకొల్పాడు
ఐపీఎల్లో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ అరుదైన ఘనత సాధించాడు. తక్కువ వయసులోనే అర్ధసెంచరీ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ రికార్డు ఇంతకు ముందు పృథ్వీషా పేరిట ఉండేది.
ఐపీఎల్ చిన్నోడు రికార్డు నెలకొల్పాడు
ఈ జాబితాలో పృథ్వీషా-సంజూ శాంసన్ రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ విడివిడిగా 18 ఏళ్ల 169 రోజుల వయసులో అర్ధసెంచరీ చేశారు.
దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టులో పరాగ్ మినహా బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. 50 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో సహాయపడ్డాడు.