తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచిన బెంగళూరు.. హైదరాబాద్​ బ్యాటింగ్

సొంతగడ్డపై హైదరాబాద్​తో మ్యాచ్​లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. సన్​రైజర్స్ ఈ రోజు గెలిస్తేనే ఫ్లేఆఫ్​లో అడుగుపెట్టే అవకాశం దక్కుతుంది. లేదంటే కోల్​కతా ఆడే తన తర్వాతి మ్యాచ్​పై ఆధారపడి ఉంటుంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

By

Published : May 4, 2019, 7:51 PM IST

బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన అతిథ్య జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత ఐపీఎల్​లో హైదరాబాద్​తో తన చివరి లీగ్​ మ్యాచ్​ ఆడనుంది.

ముంబయితో జరిగిన గత మ్యాచ్​లో సూపర్​ ఓవర్​ వరకు వెళ్లినా విజయం సాధించలేకపోయింది సన్​రైజర్స్​. ఫ్లేఆఫ్ అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. ఈ రోజు ఆర్​సీబీపై ఎలాగైనా సరే గెలివాలని పట్టుదలగా ఉంది.

హైదరాబాద్​ జట్టులో వార్నర్, బెయిర్​ స్టో లేకపోవడం పెద్ద లోటే. కానీ రన్​రేట్​ ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం. మనీశ్ పాండే ఫామ్​లో ఉండటం జట్టుకు అదనపు బలం. ఒకవేళ రైజర్స్ ఈ మ్యాచ్​ ఓడినా ఫ్లేఆఫ్​కు వెళ్లే అవకాశముంది. ఇది జరగాలంటే తన తర్వాతి మ్యాచ్​లో కోల్​కతా ఓడిపోవాలి.

జట్లు

హైదరాబాద్ సన్​ రైజర్స్​

విలియమ్సన్​(కెప్టెన్​), మనీశ్ పాండే, మార్టిన్ గప్తిల్​, నబీ, విజయ్ శంకర్​, వృద్ధిమాన్ సాహా, యూసఫ్ పఠాన్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, బసిల్ థంపీ

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్

విరాట్​ కోహ్లి (కెప్టెన్), పార్థివ్ పటేల్, డివిలియర్స్, ఉమేశ్ యాదవ్, చాహల్, గ్రాండ్​హూమ్, గుర్​కీరత్ సింగ్, హెట్మైర్, నవదీప్ సైనీ, సుందర్, కుల్వంత్

ABOUT THE AUTHOR

...view details