తెలంగాణ

telangana

ETV Bharat / sports

బెంగళూరు, రాజస్థాన్​ మ్యాచ్​ వర్షార్పణం

చిన్నస్వామి వేదికగా జరిగిన బెంగళూరు, రాజస్థాన్​ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. ఇరు జట్లకు చెరో పాయింటు ఇచ్చారు. ఈ మ్యాచ్​తో ఆర్​సీబీ ప్లే ఆఫ్​ అవకాశాలు కోల్పోయింది.

బెంగళూరు, రాజస్థాన్​ మ్యాచ్​ వర్షార్పణం

By

Published : May 1, 2019, 1:07 AM IST

Updated : May 1, 2019, 9:10 AM IST

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాజస్థాన్​ రాయల్స్​, ఆర్​సీబీ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్​ 5 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. రాజస్థాన్​ 3.2 ఓవర్లకు వికెట్​ నష్టానికి 41 పరుగుల వద్ద ఉండగా మరోసారి వర్షం కురిసింది. దీంతో మ్యాచ్​ను రద్దు చేసి.. ఇరు జట్లకు చెరో పాయింటు ఇచ్చారు. ఈ మ్యాచ్​తో ఆర్​సీబీ ప్లే ఆఫ్​ ఆశలు ఆవిరైపోయాయి.

శాంసన్​ భళా...

సంజు సాంసన్​

5 ఓవర్లలో 63 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్​కు సంజు శాంసన్​ అదిరే ఆరంభాన్నిచ్చాడు. 13 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. శాంసన్​ ఔటైన వెంటనే మళ్లీ వర్షం కురిసింది. చేసేదేం లేక అంపైర్లు మ్యాచ్​ను రద్దు చేశారు.

అంతకుముందు...

కోహ్లి, డివిలియర్స్

ఆర్​సీబీలో ఓపెనర్​గా బరిలోకి దిగిన విరాట్​ కోహ్లీ బ్యాట్​ ఝుళిపించాడు. తొలి ఓవర్​ మొదటి 2 బంతులను సిక్సర్లుగా మలిచాడు. 7 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. ఊపు మీద ఉన్న కోహ్లీని శ్రేయస్ గోపాల్​​ బోల్తా కొట్టించాడు. వెంటనే డివిలియర్స్​, స్టాయినిస్​ల​ను వరుస బంతుల్లో పెవిలియన్​కు పంపి హ్యాట్రిక్​ను ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ఐపీఎల్​ సీజన్​లో ఇది రెండో హ్యాట్రిక్​. పంజాబ్​ బౌలర్​ సామ్​ కరన్​ ఇంతకు ముందు హ్యాట్రిక్​ తీశాడు.

Last Updated : May 1, 2019, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details