ప్రస్తుత ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్ బెర్తు పొందేందుకు శ్రమిస్తోంది. సీజన్ ప్రారంభంలో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయి విమర్శల పాలైంది. ఆ తర్వాత ఆడిన గత మూడు మ్యాచుల్లో విజయం సాధించి.. ప్లేఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది.
రేపే నా పెళ్లి.. కానీ ఆర్‌సీబీ పైనే దిగులంతా! - ఐపీఎల్
ఆర్‌సీబీ అభిమాని పెట్టిన ఓ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రేపు నా పెళ్లి, అయినా ఆర్‌సీబీ ప్లే ఆఫ్ అవకాశాల గురించే నేను ఆలోచిస్తున్నానంటూ ఆ అమ్మాయి పేర్కొంది.
రేపు నా పెళ్లి.. కానీ ఆలోచించేది ఆర్‌సీబీ గురించి
ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్. 2011 నుంచి ఇప్పటివరకూ ఈ వేదికలో ఢిల్లీపై.. ఆర్‌సీబీదే పైచేయి. ఈ నేపథ్యంలో ఓ ఆర్‌సీబీ అభిమాని చేసిన ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
‘‘రేపు నా పెళ్లి.. మా కుటుంబ సభ్యులు అందరూ ఆ హడావుడిలో ఉన్నారు. కానీ నేను మాత్రం ఆర్‌సీబీ ప్లేఆఫ్ అవకాశాల గురించే ఆలోచిస్తున్నా’’ -తనీషా , ఆర్‌సీబీ అభిమాని