వరుసగా 5 పరాజయాలు.. వెంటాడుతున్న దురదృష్టంతో దాదాపు ఖాయమనుకున్న విజయం దూరమవుతోంది రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు. ఐదింటిలో 2 మ్యాచ్‌లు గెలిచి మూడో విజయం కోసం ఎదురుచూస్తోంది దిల్లీ క్యాపిటల్స్. ఈ రెండు జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ జరగనుంది.
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 205 పరుగులు చేసినా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. రసెల్ విధ్వంసంతో భారీ లక్ష్యం చిన్నదైంది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇద్దరిలో ఎవరో ఒకరు విఫలమవుతూ జట్టుకు పరాజయాలను మిగిలుస్తున్నారు. మరోవైపు దిల్లీ జట్టు వరుసగా 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఈసారి గెలవాలని చూస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
బెంగళూరు జట్టు సమష్టిగా రాణించడంలో విఫలమవుతుంది. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమవగా.. జట్టు 70 పరుగులకే ఆలౌటైంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకుంటే.. అనంతరం బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. కోల్‌కతా మ్యాచ్‌లో అయితే బౌలర్ల పేలవ ప్రదర్శనతో విజయం బెంగళూరు వాకిలి వరకు వచ్చి వెనుదిరిగింది. రాజస్థాన్ మ్యాచ్‌లోనూ ఆర్సీబీ టాప్ఆర్డర్ రాణించక.. విజయాన్ని రాయల్స్‌కి అప్పగించింది.
ఆర్సీబీ బౌలర్లలో చాహల్, పవన్ నేగి మినహా మిగతా వాళ్లు పెద్దగా రాణించట్లేదు. బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారని బెంగళూరు కెప్టెన్ కోహ్లీ కూడా కోల్‌కతాతో మ్యాచ్ అనంతరం తెలిపాడు. ఇప్పటికే 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన బెంగళూరు మరో మ్యాచ్‌లో ఓడితే ప్లే ఆఫ్ ఆశలు ఆవిరయ్యే ప్రమాదముంది.
దిల్లీ క్యాపిటల్స్