తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాయుడు 3డీ ఆటగాడే.. ఎందుకు తీసుకోలేదు? - rayudu

అంబటి రాయుడూ 3డీ ఆటగాడేనని.. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదని ట్విట్టర్​లో ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ముంబయితో జరిగిన మ్యాచ్​లో.. మహీ స్థానంలో కీపింగ్ చేశాడీ హైదరాబాదీ క్రికెటర్.

రాయుడు

By

Published : Apr 27, 2019, 11:43 AM IST

భారత ఆటగాడు అంబటి రాయుడుకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో మీమ్స్​ షికారు చేస్తున్నాయి. శుక్రవారం ముంబయితో జరిగిన మ్యాచ్​లో ధోని ఆడలేదు. మహీ స్థానంలో కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు. ఈ అంశంపై స్పందించిన మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రాయుడులో మరో ప్రతిభ దాగుందని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

'రాయుడూ 3డీ ఆటగాడే.. ప్రపంచకప్​లో ఎందుకు ఎంపిక చేయలేదని' ఒకరు ట్వీట్ చేయగా.. 'అతడు 4డీ ఆటగాడని' మరొకరు ట్వీటారు. 'బ్యాటింగ్​, ఫీల్డింగ్ తాజాగా కీపింగ్​ చేస్తున్నాడని.. ఐసీసీ అతడి బౌలింగ్​ను నిషేధించకపోయినట్లైతే రాయుడులో 4వ కోణాన్ని కూడా చూసేవాళ్లమని' ఇంకొకరు స్పందించారు.

ప్రపంచకప్​లో చోటు దక్కుతుందని చివరి వరకు ఆశించిన రాయుడును పక్కన పెట్టింది బీసీసీఐ. అతడి స్థానంలో విజయ్​శంకర్​ను తీసుకుంది. విజయ్ 3 డైమెన్షనల్​ ఆటగాడని చీఫ్ సెలెక్టర్​ ఎమ్​ఎస్​కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఈ విషయంపై స్పందించిన రాయుడు.. అయితే 3డీ కళ్లద్దాలతో ప్రపంచకప్​ చూస్తానని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details