తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉఫ్​మని ఊదేశారు.. రాజస్థాన్​కు నాలుగో పరాజయం

జయపుర వేదికగా రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. క్రిస్​లిన్, నరైన్ అదరగొట్టే ఇన్నింగ్స్​తో కోల్​కతాను గెలిపించారు. రాజస్థాన్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అర్ధశతకం వృథా అయింది.

ఉఫ్​మని ఊదేశారు.. రాజస్థాన్​కు నాలుగో పరాజయం

By

Published : Apr 7, 2019, 11:35 PM IST

కోల్​కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. జయపుర వేదికగా రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. 140 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు క్రిస్​లిన్ (50, 32 బంతుల్లో) అర్ధ శతకంతో అదరగొట్టగా, సునీల్ నరైన్(47, 25బంతుల్లో) రాణించాడు. రాజస్థాన్​ బౌలర్లలో శ్రేయస్ ఒక్కడే 2 వికెట్ల తీయగా మిగతా వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేదు. కోల్​కతా బౌలర్​ గుర్నేకి 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్'​ లభించింది.

  • రాజస్థాన్ నిదానం..

టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న కోల్​కతా జట్టు.. రాజస్ధాన్​ని 139 పరుగులకే పరిమితం చేసింది. గుర్నే రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. ప్రసిధ్ కృష్ణ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కోల్​కతా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగుల వేగాన్ని తగ్గించారు. రాజస్థాన్ బ్యాట్స్​మెన్ స్టీవ్ స్మిత్( 73, 59 బంతుల్లో) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. సొంత మైదానంలో రాజస్థాన్ బ్యాట్స్​మెన్ బ్యాట్​ ఝళిపించలేకపోయారు.

  • ఓపెనింగ్ అదిరింది...

అనంతరం బ్యాటింగ్​కు దిగిన కోల్​క​​తాకు మంచి ఆరంభం దక్కింది. తొలి వికెట్​కు 91 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఎప్పుడో ఖాయం చేశారు ఓపెనర్లు. క్రిస్​ లిన్, సునీల్ నరైన్ ధాటిగా ఆడి లక్ష్య ఛేదనలో కీలకపాత్ర పోషించారు. తర్వాత వీరిద్దరూ ఔటైనప్పటికీ మిగతా పని సులువు చేశాడు రాబిన్ ఉతప్ప (26).

ఈ మ్యాచ్​లో ముఖ్యమైన విశేషాలు

  1. నాలుగో ఓవర్ మొదటి బంతికే ధవళ్ కులకర్ణి బౌలింగ్​లో నరైన్ క్యాచ్​ని జారవిడిచాడు రాజస్ధాన్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి.
  2. ఇదే ఓవర్లో రెండో బంతికే క్రిస్​లిన్ బౌల్డ్ అయ్యాడు. బెయిల్స్​ కింద పడకపోవడంతో అంపైర్ నాటౌట్​గా ప్రకటించాడు. ఇలా రెండు సార్లు కోల్​కతాకు అదృష్టం కలిసొచ్చింది.
  3. ఇది కోల్​కతాకు నాలుగో విజయం కాగా, రాజస్థాన్​కు నాలుగో పరాజయం.

ABOUT THE AUTHOR

...view details