తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయిని కోల్​కతా అడ్డుకునేనా..! - ఐపీఎల్ 2019

ఈడెన్​ గార్డెన్స్ వేదికగా నేడు ముంబయి ఇండియన్స్​ -కోల్​కతా నైట్​రైడర్స్​ తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. వరుస ఓటముల నుంచి గట్టెక్కాలని కేకేఆర్ పట్టుదలగా ఉంది.

ఫామ్​లో ఉన్న ముంబయిని కోల్​కతా అడ్డుకునేనా..!

By

Published : Apr 28, 2019, 7:00 AM IST

Updated : Apr 28, 2019, 7:45 AM IST

చెన్నై సూపర్​ కింగ్స్​పై గెలిచి ఫామ్​లో ఉంది ముంబయి ఇండియన్స్​ జట్టు. వరుసగా 6 పరాజయాలతో నిరాశలో ఉంది కోల్​కతా నైట్​రైడర్స్​. ఈ రెండు జట్లు ఈడెన్ గార్డెన్స్​ వేదికగా నేడు తలపడనున్నాయి.

గత మ్యాచ్​లో అర్ధ సెంచరీ చేసి ఫామ్​లోకి వచ్చాడు రోహిత్ శర్మ. ముంబయికు ఇది ఆనందించదగ్గ విషయమే. ఈ మ్యాచ్​లోనూ గెలిచి ప్లే ఆఫ్ బెర్త్​ను ఖరారు చేసుకోవాలని భావిస్తోందీ జట్టు.

ఈడెన్ గార్డెన్స్

కోల్​కతా జట్టుపై ముంబయి రికార్డు మెరుగ్గానే ఉంది. నాలుగేళ్లుగా కేకేఆర్​పై ముంబయి గెలుస్తూనే ఉంది. ప్రస్తుత సీజన్​లో ఈ రెండు జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి. మే 5న మరో మ్యాచ్​ ఆడనున్నాయి.

కోల్​కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్.. రాజస్థాన్​తో గత మ్యాచ్​లో 97 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కానీ విజయం సాధించలేకపోయింది ఆ జట్టు.

మరో మూడు మ్యాచ్​లే మిగిలున్నాయి కేకేఆర్​కు. ఈ మూడింటిలోనూ కచ్చితంగా గెలిచి తీరాలని భావిస్తోంది. మరి ఈ మ్యాచ్​లో ముంబయిని అడ్డుకుంటుందేమో చూడాలి.

జట్లు (అంచనా)

ముంబయి ఇండియన్స్

రోహిత్ శర్మ(కెప్టెన్), బుమ్రా, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, డికాక్, ఎల్విన్ లూయిస్, మలింగ.

కోల్​కతా నైట్​రైడర్స్

దినేశ్ కార్తీక్​(కెప్టెన్​), క్రిస్​ లిన్, శుభ్​మన్​ గిల్​, ఆండ్రీ రసెల్​, కార్లోస్​ బ్రాత్​వైట్​, సునీల్ నరైన్​, పియూష్ చావ్లా, నితీశ్ రాణా, రింకు సింగ్, హ్యారీ గుర్నే, యర్రా పృథ్వీరాజ్​.

Last Updated : Apr 28, 2019, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details