సీజన్లో మొదటి గెలుపు కోసం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆరాటపడుతున్నాయి. ఐపీఎల్ 12వ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని రెండు జట్లు విజయంపై కన్నేశాయి. మొదటగా టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
- ప్రతి మ్యాచ్లో గెలిచే స్థితి నుంచి ఓటమి చవిచూసింది రాజస్థాన్ రాయల్స్. వచ్చిన అవకాశాలను అందుకోలేక పోయింది. వరుసగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది.
- వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఓడి విమర్శలు ఎదుర్కొంటోంది బెంగళూరు జట్టు. మొదటి మ్యాచ్లో చెన్నై చేతిలో ఘోర పరాజయం. ముంబయితో జరిగిన ఉత్కంఠ పోరులో ఓటమి చవిచూసింది. సన్ రైజర్స్తో మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్.... రెండు విభాగాల్లోనూ విఫలమై మరో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది.
- జట్లు:
రాజస్థాన్ రాయల్స్: