తెలంగాణ

telangana

ETV Bharat / sports

అర్ధశతకంతో రాణించిన స్మిత్... కోల్​కతా లక్ష్యం 140 - రాజస్థాన్

జయపుర వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్ 139 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ అర్ధశతకంతో రాణించాడు. కోల్​కతా బౌలర్లలో గుర్నే రెండు వికెట్లు తీశాడు.

అర్ధశతకంతో రాణించిన స్మిత్... కోల్​కతా లక్ష్యం 140

By

Published : Apr 7, 2019, 9:45 PM IST

​కోల్​కతా నైట్​రైడర్స్​తో తలపడుతున్న రాజస్థాన్​ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. జయపుర వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో స్టీవెన్ స్మిత్(73, 59 బంతుల్లో) అర్ధశతకంతో రాణించాడు. ఆరంభం నుంచి రాజస్థాన్​ ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. చివర్లో స్మిత్ మెరుపులతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కోల్​కతా బౌలర్లలో హ్యారీ గుర్నే రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

  • టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్ ఆరంభంలోనే రహానే(5) వికెట్​ కోల్పోయింది. అనంతరం జాస్ బట్లర్- స్మిత్ జోడి మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడింది. అనంతరం బట్లర్​(37, 34బంతుల్లో) గుర్నే చేతిలో ఔటయ్యాడు. కొద్ది సేపటికే రాహుల్ త్రిపాఠి (6) కూడా గుర్నే బౌలింగ్​లోనే వెనుదిరిగాడు. స్టీవెన్ స్మిత్ నిలకడగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ ధాటిగా ఆడలేకపోయింది రాయల్స్ జట్టు.

మరోవైపు కోల్​కతా బౌలర్లు వికెట్లు తీయకపోయినప్పటికీ పరుగుల వేగాన్ని తగ్గించారు. మంచి బంతులతో రాజస్థాన్​ బ్యాట్స్​మెన్​ని ఇబ్బంది పెట్టారు. గుర్నే 2 వికెట్లు తీసి ఆకట్టుకోగా... ప్రసిధ్ కృష్ణ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details