జయపుర వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని..రాజస్థాన్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. రాజస్థాన్ ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. 14 పరుగులు చేసిన రహానే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ బట్లర్.. 10 బంతుల్లో 23 పరుగులు చేసి ఔటయ్యాడు.
మెరిసిన చెన్నై బౌలర్లు.. రాయల్స్ 151/7
చెన్నైతో మ్యాచ్‌లో 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ప్రత్యర్థిని సాధారణ స్కోరుకే పరిమితం చేశారు.
అనంతరం వచ్చిన బ్యాట్స్మెన్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు కష్టపడాల్సి వచ్చింది. శాంసన్ 6, స్మిత్ 15, రాహుల్ త్రిపాఠి 10, స్టోక్స్ 28, రియాన్ పరాగ్ 16 తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు.
సీఎస్కేకే బౌలర్లలో దీపక్ చాహర్, జడేజా, శార్దుల్ తలో రెండు వికెట్లు తీశారు. శాంట్నర్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్‌ను ఔట్ చేసిన జడేజా... ఐపీఎల్లో 100 వికెట్లు తీసిన ఘనత సాధించాడు.