తెలంగాణ

telangana

ETV Bharat / sports

బట్లర్​ ఉతికేశాడు... 4 వికెట్ల తేడాతో రాజస్థాన్​ విజయం

వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో ​ 188 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల కోల్పోయి ఛేదించింది రాజస్థాన్ జట్టు​. బౌలర్లు, బ్యాట్స్​మెన్ల సమష్టి కృషితో ఈ సీజన్​లో రెండో విజయాన్ని  ఖాతాలో వేసుకుంది.

బట్లర్​ ఉతికేశాడు...4 వికెట్ల తేడాతో రాజస్థాన్​ విజయం

By

Published : Apr 13, 2019, 8:07 PM IST

వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై నాలుగు వికెట్ల తేడాతో రాజస్థాన్​ రాయల్స్​ గెలుపొందింది. రాజస్థాన్​ గెలుపు ఖాయమనుకున్న వేళ... చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల ఉత్కంఠ కొనసాగింది. ఆఖర్లో ముంబయి కట్టుదిట్టమైన బౌలింగ్​తో రాజస్థాన్​ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ చివర్లో శ్రేయాస్​ గోపాల్​ (13; 7 బంతుల్లో ) పరుగులతో రాజస్థాన్​కు విజయాన్ని అందించాడు. వరుస ఓటమలతో సతమతమవుతున్న రాజస్థాన్​ జట్టుకు నాలుగు మ్యాచ్​ల తర్వాత గెలుపు లభించింది.

  • టాస్​ గెలిచిన రాజస్థాన్​ రాయల్స్​... మొదట ముంబయిని బ్యాటింగ్​కు ఆహ్వానించింది.​ రోహిత్​ సేన 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 187 పరుగులు చేసింది. లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది రహానే సేన.

లక్ష్యం కరిగిపోయింది

రాజస్థాన్​ ఓపెనర్​​ జాస్​ బట్లర్​ (89; 43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు) ముంబయి పేస్​ను ఓ ఆటాడుకున్నాడు. అతడికి మద్దతుగా రహానే(37; 21 బంతుల్లో), సంజు శాంసన్​ (31; 26 బంతుల్లో) నిలిచారు.
సులువుగా విజయం సాధిస్తుందనే దశలో రాజస్థాన్​ వరుసగా వికెట్లు కోల్పోయింది. ముంబయి బౌలర్లలో కృనాల్​, బుమ్రా బౌలింగ్​ ధాటికి పెవిలియన్​కు క్యూ కట్టారు. చివర్లో శ్రేయాస్​ ఫోర్​ కొట్టి విజయాన్నందించాడు.

డికాక్​ దూకుడు

ముంబయి ఓపెనర్లు రోహిత్​, డికాక్​ ధాటికి తొలి 10 ఓవర్లలోనే 90 పరుగులు వచ్చాయి.​ డికాక్​ (81; 52 బంతుల్లో ) చక్కటి ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. సారథి రోహిత్​ శర్మ( 47; 32 బంతుల్లో), హర్దిక్​ పాండ్య చివర్లో (28; 11 బంతుల్లో) రాణించారు.

పొలార్డ్​ విఫలం​

ముంబయికి ఆరంభం బాగానే లభించినా మిడిలార్డర్​లో వచ్చిన​ పోలార్డ్​ను రాజస్థాన్​ బౌలర్లు ఇబ్బందిపెట్టారు. 12 బంతులాడి 6 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు కరీబియన్​ ఆటగాడు. సూర్యకుమార్​ 16, ఇషాన్​ కిషన్​ 5 పరుగులతో నిరాశపరిచారు.

ఆర్చర్​ పటిష్టమైన పేస్​

రాజస్థాన్​ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్​ చక్కని బంతులేశాడు. ఇతడు ​ఈ మ్యాచ్​లో మూడు వికెట్లు తీశాడు. కులకర్ణి, ఉనద్కత్​ చెరో వికెట్​ తమ ఖాతాలో వేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details