తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాణించిన రాహుల్​... రాయల్స్​ లక్ష్యం 183

మొహాలి వేదికగా రాజస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో పంజాబ్​ అదరగొట్టింది. మొదటి బ్యాటింగ్​ చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది.

రాహుల్​ అదరహొ...రాయల్స్​ లక్ష్యం 183

By

Published : Apr 16, 2019, 9:58 PM IST

మొహాలీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది.

ఓపెనర్ల జోరు..

పంజాబ్​ బ్యాట్స్​మెన్లు రాహుల్​, క్రిస్​గేల్​ మంచి ఆరంభాన్నిచ్చారు. గేల్​ (30; 22 బంతుల్లో 2ఫోర్లు, 3 సిక్సులు) వేగంగా పరుగులు చేశాడు.

  • ఆదుకున్న రాహుల్​...

గేల్​ ఔటైన తర్వాత స్కోరు మందగించింది. ఒక దశలో రాహుల్​ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. కానీ చివరికి రాహుల్​ (52; 47 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సులు) పరుగులతో మంచి ఇన్నింగ్స్​ ఆడాడు. కేఎల్​ రాహుల్​కు.. మిల్లర్​ (40, 27 బంతుల్లో) మంచి సహకారం అందించాడు.

చివర్లో తడబాటు...సారథి సర్దుబాటు
రాహుల్​, మిల్లర్​ వెంటవెంటనే ఔటవ్వడంతో తర్వాత బ్యాట్స్​మెన్లు పెవిలియన్​కు క్యూ కట్టారు. చివర్లో వచ్చిన అశ్విన్​ 4 బంతుల్లో 17 పరుగులు చేసి పంజాబ్​ స్కోరును 180 దాటించాడు.
ఆర్చర్​ బాణాలు..రాజస్థాన్​ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్​ యార్కర్లతో బెంబేలెత్తించాడు. 4 ఓవర్లు వేసిన ఈ పేసర్​ 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కులకర్ణి, ఉనద్కత్​, సోథీ తలో వికెట్​ ఖాతాలో వేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details