వెన్నునొప్పితో బాధపడుతున్న దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కగిసో రబాడ నేడు దక్షిణాఫ్రికాకు పయనమయ్యాడు. ప్రపంచకప్ దృష్ట్యా ముందు జాగ్రత్తగా స్వదేశానికి రావాలని రబాడను వెనక్కి పిలిచింది దక్షిణాఫ్రికా బోర్డు.
'ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ముందు దిల్లీ క్యాపిటల్స్‌ను వీడి వెళ్తుండటం చాలా కష్టంగా ఉంది. కానీ ప్రపంచకప్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. అందుకే బోర్డు స్వదేశానికి రమ్మని పిలిచింది. కొద్దిరోజుల్లోనే దిల్లీ జట్టుతో మంచి అనుబంధం ఏర్పడింది. కచ్చితంగా మా జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుందని నమ్మకముంది.'
-- రబాడ, దిల్లీ క్యాపిటల్స్ పేసర్