సొంతగడ్డపై కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. ఓపెనర్లు ఇద్దరూ విఫలమైన వేళ మిడిలార్డర్ క్రీజులో నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగుల స్కోరు చేసింది. శామ్ కరన్ అర్ధసెంచరీతో రాణించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న రాహుల్ 2 పరుగులకే వెనుదిరిగాడు. కొద్ది సేపటికే 14 పరుగులు చేసిన గేల్ కూడా ఔటయ్యాడు. వీరిద్దరి వికెట్లనుకొత్త బౌలర్ సందీప్ వారియర్ తీశాడు.
నిలిచారు.. స్కోరు పెంచారు..
అనంతరం క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్ వికెట్లు పడకుండా ఆడారు. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 48 పరుగులు చేసిన పూరన్‌ను నితీశ్ రానా ఔట్ చేశాడు. కొంతసేపటికే 36 పరుగులు చేసి మయాంక్ వెనుదిరిగాడు.