తెలంగాణ

telangana

ETV Bharat / sports

గేల్ మెరుపులు... పంజాబ్ 173 పరుగులు - పంజాబ్

మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో బెంగళూరు ముందు 174 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది పంజాబ్. కరీబియన్ ఆటగాడు క్రిస్​ గేల్​ 99 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.

గేల్ 99 నాటౌట్...పంజాబ్ 173/4

By

Published : Apr 13, 2019, 9:59 PM IST

మొహాలీ వేదికగా రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్​లో నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్. 99 పరుగులతో ఆకట్టుకున్నాడు పంజాబ్​ బ్యాట్స్​మెన్​ గేల్​. ఓవర్లు పూర్తయ్యాయి.. లేదంటే శతకం చేసేవాడీ కరిబీయన్ బ్యాట్స్​మెన్.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. ధాటిగా ఆడిన రాహుల్- గేల్ జోడీ.. తొలి వికెట్​కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అనంతరం 18 పరుగులు చేసిన రాహుల్ చాహల్ బౌలింగ్​లో ఔటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన మయాంక్ 15, సర్ఫరాజ్ 15, సామ్ కరన్ 1, మన్​దీప్ సింగ్ 18 పరుగులు చేశాడు.

బెంగళూరు బౌలర్లలో చాహల్ 2, సిరాజ్, మొయిన్ అలీ తలో వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details