చెరో ఐదో విజయాలతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. ఫిరోజ్‌షా కోట్లా ఈ రసవత్తర పోరుకువేదిక. ఈ సీజన్లో దిల్లీతో సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది ముంబయి. ఇప్పుడు దిల్లీ వేదికగా ఆ జట్టుతో తలపడుతోంది. ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.
- వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీదుంది దిల్లీ. ఇప్పటికే వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ముంబయిని ఓడించింది దిల్లీ క్యాపిటల్స్. ఇప్పుడు సొంతగడ్డపై మరోసారి రోహిత్‌సేనను మట్టికరిపించాలని అనుకుంటోంది. గత మ్యాచ్‌లో బెంగళూరుపై మ్యాచ్ గెలిచింది ముంబయి. సొంతగడ్డపై దిల్లీతో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
దిల్లీ క్యాపిటల్స్...
ఈ సీజన్లో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి రెండో స్థానంలో ఉంది దిల్లీ క్యాపిటల్స్. రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ లాంటి దిగ్గజాల పర్యవేక్షణలో వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. గత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 155 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. రబాడ, మోరిస్ విజృంభించి రైజర్స్‌ను 116 పరుగులకే కట్టడి చేశారు. ఆ మ్యాచ్‌లో కీమో పాల్ మూడు వికెట్లు తీసి రైజర్స్ పతనాన్ని శాసించాడు.
- గత రెండు మ్యాచ్‌ల్లో పాల్ 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రబాడ, మోరిస్, కిమో పాల్‌తో దిల్లీ పేస్ విభాగం పటిష్ఠంగా ఉంది.
- బ్యాట్స్మెన్లలో పృథ్వీషా, శిఖర్ ధావన్, పంత్, ఇన్‌గ్రామ్, శ్రేయాస్ అయ్యర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో సమష్టిగా రాణించి విజయాన్ని కైవసం చేసుకోవాలనుకుంటోంది దిల్లీ.
ముంబయి ఇండియన్స్...