దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20ఓవర్లలో 166 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ జట్టు... పంజాబ్‌ను మోస్తరు స్కోరుకే పరిమితం చేసింది. మోరిస్ 3, సందీప్ 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. సర్ఫరాజ్- మిల్లర్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.
రెండో ఓవర్లోనే పంజాబ్ ఓపెనర్ రాహుల్‌ని ఔట్ చేశాడు క్రిస్ మోరిస్. కొద్ది సేపటికే సామ్ కరన్ (20), మయాంక్ అగర్వాల్(6) లను పెవిలియన్ చేర్చింది దిల్లీ. అనంతరం మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది సర్ఫరాజ్ ఖాన్(39) డేవిడ్ మిల్లర్(43) జంట. వీరిరువురూ 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టారు. రెండు ఓవర్ల వ్యవధిలో సర్ఫరాజ్, మిల్లర్ ఔట్ కాగా.. చివర్లో పంజాబ్ స్కోరు నెమ్మదించింది. గేల్ లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది.