తెలంగాణ

telangana

ETV Bharat / sports

డికాక్​ దూకుడు... రాజస్థాన్​ విజయ లక్ష్యం 188

వాంఖడే వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన ముంబయి ఇండియన్స్​ 187 పరుగులు చేసింది. డికాక్​, రోహిత్​ శర్మ ఆకట్టుకున్నారు. చివర్లో హార్దిక్​ పాండ్య దూకుడుగా ఆడాడు.

డికాక్​ దూకుడు...రాజస్థాన్​ విజయ లక్ష్యం 188

By

Published : Apr 13, 2019, 5:58 PM IST

Updated : Apr 13, 2019, 6:04 PM IST

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్​లో టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగింది ముంబయి ఇండియన్స్‌. ఓపెనర్ల దూకుడుకు తోడు చివర్లో హార్దిక్​ వేగంగా ఆడటం వల్ల 187 పరుగులు సాధించింది. రాయల్స్​ ముందు 188 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఓపెనర్ల హవా...

ముంబయి ఓపెనర్లు రోహిత్​, డికాక్​ ధాటికి 10 ఓవర్లలోనే 90 పరుగులు వచ్చాయి. సారథి రోహిత్​ శర్మ( 47; 32 బంతుల్లో) ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్​ డికాక్​ (81; 52 బంతుల్లో ) చక్కటి ఇన్నింగ్స్​తో స్కోరు బోర్డును పరుగులెత్తించారు.

  • తొలి వికెట్​ తర్వాత మందకొడి...

ఓపెనర్ల దూకుడుకు ఓ దశలో 200 పైగా స్కోరు వస్తుందనుకున్నప్పటికీ.. రోహిత్​ ఔటవ్వడం వల్ల జోరుకు అడ్డుకట్ట పడింది. 11వ ఓవర్‌లో కెప్టెన్‌ రోహిత్‌శర్మ(47, 32 బంతుల్లో 6x4, 1x6) భారీ షాట్‌కు ప్రయత్నించి బట్లర్‌ చేతికి చిక్కాడు. త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. ఆ సమయంలో డికాక్‌ అర్ధశతకం సాధించాడు. అయితే డికాక్​కు సరైన సహాకారం అందకపోవడం.. వీలు చిక్కినప్పుడల్లా రాజస్థాన్​ బౌలర్లు వికెట్ల తీయడంతో పరుగుల వేగం మందగించింది.

మిడిలార్డర్​​ మెరుపుల్లేవ్​...

వన్​ డౌన్​ బ్యాట్స్​మెన్​గా వచ్చిన సూర్య కుమార్​ (16; 10 బంతుల్లో) నిరాశపరిచాడు. హిట్టర్​ పొలార్డ్​ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఏకంగా 12 బంతులాడి 6 పరుగులు మాత్రమే చేశాడీ కరీబియన్​. ఇషాన్​ కిషన్​ (5 పరగులు; 3 బంతుల్లో ) ఔటయ్యాడు. చివర్లో హార్దిక్​ 28 పరుగుల(3 సిక్సులు, ఒక ఫోర్​)తో సూపర్​ హిట్టింగ్​ చేయడం వల్ల 187 పరుగులు చేసింది రోహిత్​ సేన.

  • ఆర్చర్​ అడ్డుకున్నాడు...

ఈ సీజన్​లో అత్యధిక వికెట్లతో ఆరెంజ్​ క్యాప్​తో కొనసాగుతున్న జోఫ్రా ఆర్చర్...​ ఈ మ్యాచ్​లోనూ మూడు వికెట్లు తీశాడు. కులకర్ణి, ఉనద్కత్​ చెరో వికెట్​ తమ ఖాతాలో వేసుకున్నారు.

Last Updated : Apr 13, 2019, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details