తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెరిసిన రోహిత్ శర్మ .. చెన్నై లక్ష్యం 156 - చెన్నై సూపర్ కింగ్స్

చెపాక్​లో చెన్నైకు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ముంబయి ఇండియన్స్. కెప్టెన్ రోహిత్ శర్మ 67 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చివర్లో పాండ్య మెరుపులతో ముంబయి గౌరవప్రదమైన స్కోరు చేసింది.

మెరిసిన రోహిత్ శర్మ .. చెన్నై లక్ష్యం 156

By

Published : Apr 26, 2019, 9:51 PM IST

చెపాక్​ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది ముంబయి. కెప్టెన్ రోహిత్ శర్మ 67 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. సీఎస్​కే బౌలర్లలో శాంట్నర్ రెండు వికెట్లు తీశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగింది ముంబయి. ఓపెనర్​గా వచ్చిన డికాక్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడో స్థానంలోకి బ్యాటింగ్​కు దిగిన లూయిస్... మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ జోడీ రెండో వికెట్​కు 75 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది. 32 పరుగులు చేసిన లూయిస్.. శాంట్నర్ బౌలింగ్​లో ఔటయ్యాడు. చివరి ఓవర్లో పాండ్య మెరుపులతో చెన్నై గౌరవప్రదమైన స్కోరు చేసింది.

మిగతా బ్యాట్స్​మెన్​ పరుగులు చేసేందుకు కష్టపడ్డారు. కృనాల్ పాండ్య 1, హార్దిక్ పాండ్య 23, పొలార్డ్ 13 పరుగులు చేశారు.

చెన్నై బౌలర్లలో శాంట్నర్ రెండు వికెట్లు తీశాడు. తాహిర్, దీపక్ చాహర్ తలో వికెట్ తీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details