తెలంగాణ

telangana

ETV Bharat / sports

రో'హిట్టింగా'...  విరాట్​ సేన విజయమా! - RCB

వాంఖడే వేదికగా ముంబయి- బెంగళూరు మధ్య ఈ రోజు మ్యాచ్​ జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గత మ్యాచ్​తో గెలుపు బాట పట్టిన ఆర్​సీబీ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది.

రోహిత్- విరాట్

By

Published : Apr 15, 2019, 8:00 AM IST

వరుస విజయాలతో జోరు మీదున్న ముంబయి ఇండియన్స్​... రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో పరాజయం చెందగా... వరుస అపజయాలతో డీలా పడిన బెంగళూరు, గత మ్యాచ్​లో పుంజుకుని పంజాబ్​పై విజయం సాధించింది. నేడు ఈ రెండింటి మధ్య ముంబయి వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్​ జరగనుంది.

ఈ సీజన్​లో ఆరు మ్యాచ్​ల అనంతరం బోణి కొట్టిన బెంగళూరు ఇదే ఊపు కొనసాగించాలనుకుంటోంది. రాజస్థాన్​పై పరాజయం చెందిన రోహిత్ సేన మళ్లీ జోరు పెంచాలనుకుంటోంది.

ముంబయి ఇండియన్స్​...

గత మ్యాచ్​లో డికాక్(81), రోహిత్ శర్మ(47) రాణించినా.. బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలకపోయారు. బ్యాట్స్​మెన్ 187 పరగులు చేసినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది ముంబయి జట్టు. రాజస్థాన్ బ్యాట్స్​మెన్ బట్లర్​ని కట్టడి చేయలేక మ్యాచ్ సమర్పించుకుంది రోహిత్ సేన. హార్ధిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్​లతో బ్యాటింగ్​ లైనప్​ బలంగా ఉంది. సన్​రైజర్స్​ మ్యాచ్​లో ఆరు వికెట్లతో ఆకట్టుకున్న అల్జారీ జోసెఫ్ గత మ్యాచ్​లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గాయంతో ఈ కరేబియన్​ బౌలర్​ మ్యాచ్​కు దూరమయ్యే అవకాశముంది. ఎట్టకేలకు ఓ విజయం అందుకుని జోరు మీద ఉన్న బెంగళూరుపై ముంబయి ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.

రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు...

పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో డివిలియర్స్, కోహ్లి విజృంభించి ఎట్టకేలకు బెంగళూరును గెలిపించారు. ఇదే ఊపులో ముంబయిపై విజయం సాధించి సత్తా చాటాలనుకుంటున్నారు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కోహ్లి సేన ప్లే ఆఫ్​కు చేరాలంటే ఇక మీదట అన్నీ మ్యాచ్​ల్లో గెలవాలి. ఎక్కువగా కోహ్లి, డివిలియర్స్​పై ఆధారపడుతున్న బెంగళూరు జట్టులో... మిగతా బ్యాట్స్​మెన్ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్​లో యజువేంద్ర చాహల్ టోర్నీలో 11 వికెట్లతో దూసుకెళ్తున్నాడు. వాంఖడే స్లో పిచ్ కావాడం వల్ల చాహల్​ కీలకం కానున్నాడు. కానీ అతనికి మిగతా బౌలర్ల నుంచి సహాకారం అందాల్సి ఉంది. డేల్ స్టెయిన్ జట్టులో కలిసే అవకాశముంంది. దీంతో బెంగళూరు పేస్ విభాగం బలం పుంజుకోనుంది.

ఈ సీజన్​లో బెంగళూరుతో ఆడిన తొలి మ్యాచ్​లో ముంబయి విజయం సాధించింది.

జట్ల అంచనా

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్

విరాట్ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్(వికెట్​ కీపర్​), మొయిల్ అలీ, ఏబీ డివిలియర్స్, హెట్మైర్, స్టాయినిస్​, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, చాహల్, మహమ్మద్ సిరాజ్, గ్రాండ్​హమ్

ముంబయి ఇండియన్స్

రోహిత్ శర్మ, పొలార్డ్, బెహ్రాండార్ఫ్, సూర్యకుమార్ యాదవ్, డికాక్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, అల్జారీ జోసెఫ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్

ABOUT THE AUTHOR

...view details