ఇప్పటికే మూడు ఐపీఎల్ టైటిళ్లు సాధించింది చెన్నై. ఈ సీజన్లోనూ వరుసగా 3 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ధోని ఫామ్ జట్టుకు మరింత ఉత్సాహాన్నిస్తుంది.
ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచింది ముంబయి. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు మరింతగా రాణించాల్సి ఉంది.
- ఇరుజట్లు తలపడిన మ్యాచ్‌ల్లో ముంబయి ఎక్కువసార్లు గెలిచింది. చెన్నైతో జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో ముంబయి విజయం సాధించడం విశేషం. మొత్తంగా సూపర్ కింగ్స్‌పై 14-12 తేడాతో రోహిత్ సేనదే పైచేయి.
చెన్నై సానుకూలతలు..
- గత మ్యాచ్‌లో ధోని చెలరేగడం చెన్నైకి పెద్ద సానుకూలత. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో ధోని అద్భుత ప్రదర్శన (46 బంతుల్లో 75)తో 175 పరుగులు సాధించింది జట్టు. మ్యాచ్‌లోనూ విజయం సాధించింది.
- చివరి ఓవర్లలో డ్వేన్ బ్రావో ప్రదర్శన కూడా చెన్నైకి పెద్ద బలం. హర్భజన్, సాంటర్న్, తాహిర్, జడేజా లాంటి స్పిన్నర్లు ఆ జట్టు సొంతం.
- ముంబయి బ్యాటింగ్‌లో ఎక్కువగా రోహిత్, డికాక్ మీద ఆధారపడుతుంది. మిడిలార్డర్ కుదురుకోవాల్సిన అవసరం ఉంది. చెన్నైతో పోలిస్తే పేస్ బౌలింగ్‌లో ముంబయి కాస్త బలంగా ఉంది.
- జట్టులోకి కొత్తగా వచ్చిన అల్జారీ జోసెఫ్ పాటు బెన్ కటింగ్ రాణిస్తే జట్టుకు మరింత ప్రయోజనకరం.