తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయి ప్రతీకారం తీర్చుకుంటుందా..? - ముంబయి ఇండియన్స్

వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్- కింగ్స్​ ఎలెవన్ పంజాబ్...నేడు ఐపీఎల్ మ్యాచ్​ ఆడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్​లో పంజాబ్ గెలిచింది.

పంజాబ్​పై ముంబయి ప్రతీకారం తీర్చుకుంటుందా..?

By

Published : Apr 10, 2019, 8:30 AM IST

నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఆరు మ్యాచ్​లు ఆడిన పంజాబ్ నాలుగింటిలో విజయం సాధించంగా.. ఐదు మ్యాచ్​ల్లో మూడు ముంబయి ఇండియన్స్ జట్టు మూడు గెలిచింది.

చివరిసారి ఇరుజట్లు మొహాలీలో తలపడగా పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండటం ముంబయికి కలిసొచ్చే అంశం.

చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లపై విజయంతో ముంబయి జోరు మీదుంది. నాణ్యమైన బౌలింగ్ ఈ జట్టు సొంతం. రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్, పాండ్యా సోదరులతో బ్యాటింగ్ దళం బలంగా ఉంది. చెన్నైతో జరిగిన మ్యాచ్​లో రెండు ఓవర్లలో 45 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించారు పొలార్డ్, హార్దిక్ పాండ్యా.

బౌలింగ్​లోనూ ముంబయి జట్టు పటిష్టంగా ఉంది. సన్ రైజర్స్​పై కేవలం 12 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసిన అల్జారీ జోసెఫ్ ఈ మ్యాచ్​లో ఫేవరేట్​గా బరిలోకి దిగుతున్నాడు. ఇతడితో పాటు బుమ్రా, బెహ్రండార్ఫ్, హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నారు.

గత మ్యాచ్​లో సన్ రైజర్స్​తో ఉత్కంఠ పోరులో గెలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. బ్యాటింగ్, బౌలింగ్​లో మరింత మెరుగవ్వాల్సి ఉందని అంటున్నాడు ఆ జట్టు కెప్టెన్ అశ్విన్.

రాహుల్, మయాంక్ అగర్వాల్ సన్ రైజర్స్​పై అద్భుత ప్రదర్శన చేశారు. గేల్ కూడా సత్తా చాటాలని జట్టు భావిస్తోంది. బౌలింగ్​లోనూ అశ్విన్ అదరగొడుతున్నాడు. సామ్ కరన్, షమి, మురుగన్ అశ్విన్ లాంటి బౌలర్లతో బౌలింగ్ దళం బలంగా ఉంది.

జట్ల అంచనా

ముంబయి ఇండియన్స్
రోహిత్ శర్మ, పొలార్డ్, బెహ్రాండార్ఫ్, సూర్యకుమార్ యాదవ్, డికాక్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, అల్జారీ జోసెఫ్, కృణాల్ పాండ్యా, రాహుల్ చాహర్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రవిచంద్రన్ అశ్విన్, లోకేష్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, మిల్లర్, మన్​దీప్ సింగ్, సామ్ కరన్, అంకిత్​ రాజ్ పుత్, షమి, ముజిబర్ రెహమన్

ABOUT THE AUTHOR

...view details