తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నైపై మరోసారి ముంబయి పంజా... - chepak

సొంతగడ్డపై జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్ 46 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానం దక్కించుకుంది రోహిత్​ సేన. 67 పరుగులు చేసిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​ లభించింది.

మ్యాచ్​లో లేని ధోని.. మళ్లీ ఓడిన చెన్నై

By

Published : Apr 27, 2019, 12:03 AM IST

చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్​లో 46 పరుగుల తేడాతో​ గెలిచిందిముంబయి ఇండియన్స్. రోహిత్​ సేన నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 109 పరుగులకే ఆలౌటైంది సూపర్​కింగ్స్​. మలింగ 4 వికెట్లు తీసి చెన్నై పతనాన్ని శాసించాడు. ఈ ఐపీఎల్​లో చెన్నైను రెండు సార్లు ఓడించింది ముంబయి జట్టే కావడం విశేషం.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయిలో రోహిత్ శర్మ ఆటే హైలేట్. మిగతా బ్యాట్స్​మెన్ అందరూ నామమాత్రపు స్కోర్లకే వెనుదిరిగినా అతడు మాత్రం 67 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ సీజన్​లో తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.

మిగతా బ్యాట్స్​మెన్​లలో డికాక్ 15, లూయిస్ 32, కృనాల్ 1, హార్దిక్ 23, పొలార్డ్ 13 పరుగులు చేశారు.

చెన్నై బౌలర్లలో శాంట్నర్ రెండు వికెట్లు తీశాడు. తాహిర్, చాహర్ తలో వికెట్ తీశారు.

అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్​తో ఫామ్​లోకి వచ్చిన వాట్సన్ కేవలం 8 పరుగులే చేసి ఔటయ్యాడు. ఓ ఎండ్​లో మురళీ విజయ్ నిలదొక్కుకున్నా అతడికి సహకారమందించే వారు కరువయ్యారు.

రైనా 2, రాయుడు 0, జాదవ్ 6, షోరే 5, చాహర్ 0, హర్భజన్ సింగ్ 1 సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యారు. మ్యాచ్​ను ఏ దశలోనూ విజయం దిశగా తీసుకెళ్లలేకపోయారు బ్యాట్స్​మెన్లు.

అద్భుతంగా బౌలింగ్​ చేసిన ముంబయి బౌలర్లు జట్టుకు మరో విజయాన్ని అందించారు. మలింగ 4 వికెట్లు తీశాడు. కృనాల్, బుమ్రా తలో రెండు వికెట్లు... హార్దిక్, అంకుల్ రాయ్ తలో వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details