సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఓ మాదిరే స్కోరుకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి రోహిత్ సేన పరుగుల కోసం తీవ్రంగా శ్రమించింది. చివర్లో పొలార్డ్ 26 బంతుల్లోనే 46 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
పొలార్డ్ ఒక్కడే..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిదానంగా సాగింది. నాలుగో ఓవర్లోనే రోహిత్ వికెట్ కోల్పోయింది. అనంతరం మిగతా బ్యాట్స్‌మెన్ వరసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. డికాక్(19), ఇషాన్ కిషన్(17) కొద్ది సేపు పోరాడినా.. పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సిద్ధార్థ్ కౌల్ వేసిన 19వ ఓవర్లో 3 సిక్సర్లు బాది తనేంటో నిరూపించాడు పొలార్డ్. చివరి రెండు ఓవర్లలో ఈ విండీస్ ఆటగాడి హిట్టింగ్తో 39 పరుగులు రాబట్టుకుంది ముంబయి.
- గత 2 మ్యాచుల్లో ఆకట్టుకున్న నబీ ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. ఆరంభంలోనే రోహిత్‌ని ఔట్ చేసి ముంబయిని కోలుకోలేని దెబ్బతీశాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్‌ని ఎల్బీగా వెనక్కి పంపించాడు సందీప్ శర్మ. నిలకడగా ఆడుతున్న డికాక్‌ని కౌల్ పెవిలియన్ చేర్చాడు. కొద్దిసేపటికే కృనాల్‌ని కూడా ఔట్ చేశాడు. తర్వాత ముంబయి బ్యాటింగ్ నత్తనడకన సాగింది.
సన్‌రైజర్స్ బౌలర్లలో కౌల్ రెండు వికెట్లు తీయగా... సందీప్, భువీ, నబీ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
- ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ బౌలింగ్‌లో రెండు క్యాచ్‌లు జారవిడిచారు సన్‌రైజర్స్ ఆటగాళ్లు. తొలి ఓవర్లోనే రోహిత్ బంతిని గాల్లోకి లేపగా ఆ క్యాచ్‌ని పట్టుకోలేకపోయాడు కౌల్. అనంతరం 18వ ఓవర్లో పొలార్డ్ క్యాచ్ జారవిడిచాడు రషీద్ ఖాన్. ఈ క్యాచ్ పట్టుంటే ముంబయి మరింత తక్కువ స్కోరుకే పరిమితమయ్యేదే.