తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనిని చూసి కోహ్లీ ఎందుకు భయపడ్డాడో తెలుసా? - #ETV BHARAT

ఆదివారం జరిగిన బెంగళూరు-చెన్నై మ్యాచ్​లో ఒక్క పరుగు తేడాతో ఆర్​సీబీ విజయం సాధించింది. బ్యాటింగ్​లో వీరవిహారం చేసిన ధోనిని చూసి భయపడ్డానని కోహ్లీ అన్నాడు.

'ధోని మమ్మల్ని భయపెట్టేశాడు' అంటున్న విరాట్ కోహ్లి

By

Published : Apr 22, 2019, 10:14 AM IST

ఆదివారం బెంగళూరు-చెన్నై ఐపీఎల్​ మ్యాచ్​ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివర బంతి వరకు గెలుపు ఎవరిదో తేల్చుకోలేకపోయారు. ఈ మ్యాచ్​లో​ కెప్టెన్ ధోని బ్యాటింగ్​ చూసి భయపడ్డానని ఆర్​సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.

" మ్యాచ్​ ఎంతో ఉద్వేగంగా సాగింది. 19వ ఓవరు వరకు గెలుపు మాదే అనుకున్నాం. కానీ ధోని వీర విహారంతో మ్యాచ్​ చేజారుతుందేమో అనుకున్నాం. చివరకు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించాం. బౌలర్లపై విరుచుకుపడిన మహీ మమ్మల్ని భయపెట్టేశాడు" -కోహ్లీ, ఆర్​సీబీ కెప్టెన్

ఈ మ్యాచ్​లో చెలరేగి ఆడిన ధోని.. 48 బంతుల్లో 84 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు.

ఈ సీజన్​లో 10 మ్యాచ్‌లు ఆడి 6 పాయింట్లు దక్కించుకున్న ఆర్సీబీకి ఇంకా ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. 24న జరిగే మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఆర్సీబీ తలపడనుంది.

ఇది చదవండి: ధోని విజృంభించినా.. బెంగళూరుదే విజయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details