ఐపీఎల్ 12వ సీజన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మొహాలీలో నేడు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.
ఇప్పటి వరకు రెండు జట్లు చెరో ఐదు మ్యాచ్‌లు ఆడగా...మూడేసి విజయాలు తమ ఖాతాలో వేసుకున్నాయి. రన్‌రేట్ మెరుగ్గా ఉండటం వల్ల మూడో స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్.
- రెండు జట్లను మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది. ఓపెనర్లు శుభారంభం అందించినా మిడిలార్డర్‌లో నిలదొక్కుకుని జట్టును ఆదుకునే ఆటగాళ్లు కరవయ్యారు. రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఈ వైఫల్యంతోనే ఓటమిపాలయ్యాయి.
ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టోలపైనే సన్‌రైజర్స్ ఎక్కువగా ఆధారపడుతోంది. మిడిలార్డర్ రాణించాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. అలాగే సొంతగడ్డపై పరిస్థితులను సద్వినియోగం చేసుకొని మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని పంజాబ్ భావిస్తోంది.