తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెరిసిన ముంబయి బౌలర్లు.. లక్ష్యం 134 - ఐపీఎల్

ముంబయితో జరుగుతున్న మ్యాచ్​లో 20 ఓవర్లలో 133 పరుగులు చేసింది కోల్​కతా నైట్​రైడర్స్​. ముంబయి బౌలర్లు మలింగ, బుమ్రా, హార్దిక్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. కోల్​కతా బ్యాట్స్​మెన్​ రసెల్​ డకౌట్​ అయ్యాడు.

మెరిసిన ముంబయి బౌలర్లు.. లక్ష్యం 134

By

Published : May 5, 2019, 9:53 PM IST

సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్​లో ప్రత్యర్థి కోల్​కతా జట్టును తక్కువ స్కోరుకే కట్టిడి చేసింది ముంబయి ఇండియన్స్​. నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులే చేయగలిగింది కోల్​కతా నైట్​రైడర్స్. లిన్(41), ఊతప్ప(40) మినహా మరే ఇతర బ్యాట్స్​మెన్ రాణించలేకపోయారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగింది కోల్​కతా. తొలి వికెట్​కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఓపెనర్లు లిన్- శుభ్​మన్. అనంతరం స్వల్ప వ్యవధిలోనే లిన్(41), శుభ్​మన్(9) ఔటయ్యారు.

తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్​లో ఊతప్ప ఒక్కడే చివరి వరకు నిలిచాడు. కానీ వేగంగా పరుగులు చేయలేకపోయాడు. 47 బంతులాడి 40 పరుగులు చేసి చివరి ఓవర్​లో వెనుదిరిగాడు.

మిగతా వారిలో దినేశ్ కార్తీక్ 3, రింకూ సింగ్ 4 పరుగులు చేయగా రసెల్ డకౌట్ అయ్యాడు.

మ్యాచ్​ మొత్తం కట్టుదిట్టంగా బంతులేశారు ముంబయి బౌలర్లు. మలింగ మూడు వికెట్లు తీయగా, బుమ్రా, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు తీశారు.

ABOUT THE AUTHOR

...view details