ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది కోల్‌కతా. జట్టు సభ్యులందరూ పెవిలియన్ బాటపట్టినా కెప్టెన్ దినేశ్ కార్తిక్ మాత్రం పట్టువిడవలేదు. చివరి వరకు క్రీజులో నిలిచి 97 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ ఆరోన్ రెండు వికెట్లు తీశాడు.
సారథి ఒంటరి పోరాటం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ లిన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్‌మెనూ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. కెప్టెన్ దినేశ్ కార్తిక్ చివరి వరకు ఒంటరి పోరాటం చేసి 50 బంతుల్లో 97 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేశాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో శుభ్‌మాన్ గిల్ 14, నితీశ్ రానా 21, నరైన్ 11, రసెల్ 14, బ్రాత్‌వైట్ 5 పరుగులు మాత్రమే చేశారు.
రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ ఆరోన్ రెండు వికెట్లు తీశాడు. థామస్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు.