ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో కోల్‌కతా, బెంగళూరు జట్లు కొత్త రికార్డులు నమోదుచేశాయి. టీ 20ల్లో(ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్) కోల్‌కతా వందో విజయాన్ని అందుకోగా.. ఆదివారం జరిగిన ఇంకో మ్యాచ్‌లో బెంగళూరు టీ 20ల్లో వందో పరాభవాన్ని మూటకట్టుకుంది.
ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వందో విజయాన్నందుకుంది కోల్‌కతా. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌తో 100 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ముంబయికి సారథ్యం వహించిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు.