ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో విజయం సాధించింది కోల్‌కతా నైట్‌రైడర్స్. కోల్‌కతా నిర్దేశించిన 233 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో... ఆరంభంలోనే తడబడింది రోహిత్ సేన. ముంబయిని ఓడించి ఐపీఎల్లో మొత్తం 100 విజయాలు ఖాతాలో వేసుకుంది కోల్‌కతా జట్టు.బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన రసెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ముంబయి బ్యాట్స్‌మెన్ క్యూ...
ఓపెనర్లు డికాక్(0), రోహిత్ (12), లూయిస్(15), సూర్యకుమార్(26), పొలార్డ్(20) తక్కువ పరుగులకే ఔటయ్యారు. దీంతో సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయి...మిడిలార్డర్ బ్యాట్స్మెన్లపై ఒత్తిడి ఎక్కువైంది.
హర్దిక్ సంచలన ఇన్నింగ్స్...
58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో ముంబయి 198 పరుగులు చేసిందంటే హర్దిక్ ఇన్నింగ్సే కారణం. 34 బంతుల్లో 91 పరుగులు(6 ఫోర్లు, 9 సిక్సులు)చేసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.విజయాన్ని అందించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కాని భారీ లక్ష్యం కావడం మిగతా బ్యాట్స్మెన్ల నుంచి సరైన సహాకారం లేక విజయాన్ని అందుకోలేకపోయింది ముంబయి.