తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంజాబ్​పై గెలుపుతో ప్లేఆఫ్​ రేసులో కోల్​కతా - ఐపీఎల్​ 2019

సొంతగడ్డపై కోల్​కతాతో మ్యాచ్​లో పంజాబ్​ ఓటమి పాలైంది. 7 వికెట్ల తేడాతో నైట్​రైడర్స్ గెలిచింది. 65 పరుగులు చేసిన శుభ్​మన్ గిల్.. మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు.

గెలిచి ఫ్లేఆఫ్​ రేసులోకి వచ్చిన కోల్​కతా

By

Published : May 4, 2019, 12:48 AM IST

మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో కోల్​కతా గెలిచింది. పంజాబ్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని రెండు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్.. 65 పరుగులతో ఆకట్టుకున్నాడు.

184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్​కతాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్​కు 6 ఓవర్లలోనే 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 46 రన్స్ చేసి క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు లిన్. చివరి వరకు నిలిచినా శుభ్​మన్ గిల్ 65 పరుగులతో రాణించాడు.

అనంతరం వచ్చిన ఉతప్ప, రసెల్ తక్కువ పరుగులే చేశారు. అయినా శుభ్​మన్​తో కలిసి గెలుపునకు అవసరమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు.

చివర్లో వచ్చిన దినేశ్ కార్తీక్, గిల్​తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. 9 బంతుల్లో 21 పరుగులు చేసిన కార్తీక్ జట్టును గెలిపించాడు. ఫ్లే ఆఫ్ రేసులో నిలబెట్టాడు.

పంజాబ్​ బౌలర్లలో షమి, అశ్విన్, టై తలో వికెట్ తీశారు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగింది పంజాబ్. ఆదిలోనే​ ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. ఫామ్​లో ఉన్న రాహుల్ 2 పరుగులు చేయగా, గేల్ 14 పరుగులు చేసి ఔటయ్యాడు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన మయాంక్ అగర్వాల్ 36, పూరన్ 48 పరుగులతో రాణించారు. చివర్లో బ్యాటింగ్​కు దిగిన ఆల్​రౌండర్​ కరన్.. ఐపీఎల్​లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. 24 బంతుల్లోనే 55 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

మిగతా బ్యాట్స్​మెన్​లో అశ్విన్ డకౌట్​గా వెనుదిరిగాడు. మన్​దీప్ సింగ్ 25 పరుగులు చేశాడు.

కోల్​కతా బౌలర్లలో సందీప్ వారియర్ 2 వికెట్లు తీశాడు. హ్యారీ గుర్నే, రసెల్, రానా తలో వికెట్ తీశారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details