తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్లే ఆఫ్​ చేరాలంటే తప్పక గెలవాల్సిందే..!

ప్లే ఆఫ్​లో స్థానం కోసం కీలక మ్యాచ్​ ఆడనున్నాయి కోల్​కతా - పంజాబ్ జట్లు. మొహాలి వేదికగా నేడు మ్యాచ్​ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచ్​లలో గెలిచి ప్లే ఆఫ్​పై​ దృష్టి పెట్టాయి. పంజాబ్​తో పోల్చుకుంటే కోల్​కతా రన్​రేట్ కాస్త మెరుగ్గా ఉంది.

కోల్​కతా- పంజాబ్

By

Published : May 3, 2019, 6:00 AM IST

Updated : May 3, 2019, 7:36 AM IST

ఈ సీజన్​ ఐపీఎల్​లో ఆడిన 12 మ్యాచ్​ల్లో చెరో ఐదింటిలో గెలిచి ప్లే ఆఫ్​లో స్థానం కోసం పోటీ పడుతున్నాయి కోల్​కతా నైట్​ రైడర్స్​ - కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్ జట్లు. నేడు ఈ రెండింటి మధ్య మొహాలి వేదికగా మ్యాచ్​ జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్​. ఈ మ్యాచ్​లో ఓడిన జట్టు ప్లే ఆఫ్​కు దాదాపు దూరమైనట్టే.

ఈ మ్యాచ్​లో నెగ్గి చివరి మ్యాచ్​లో ఓడినా... ఇందులో ఓడి తర్వాతి దాంట్లో నెగ్గినా ఇరు జట్ల నెట్​ రన్​రేట్ ఆధారంగా ఎక్కువ రన్​రేట్​ ఉన్న జట్టు ప్లే ఆఫ్​కు వెళ్లే అవకాశముంది. టాప్​-4 స్థానం కోసం 3 జట్లు (కోల్​కతా, పంజాబ్, హైదరాబాద్​) పోటీ పడుతున్నాయి. రాజస్థాన్​ రాయల్స్​, బెంగళూరు కూడా నామమాత్రంగా ఇంకా రేసులోనే ఉన్నాయి.

ఈ సీజన్​ ప్రారంభంలో వరుసగా మ్యాచ్​లు గెలిచిన కోల్​కతా తర్వాత వెనుకబడింది. ఒకరిద్దరిపైనే ఎక్కువగా ఆధారపడుతూ.. సమష్టిగా రాణించడంలో విఫలమౌతుంది రైడర్స్​ జట్టు. గత మ్యాచ్​లో ముంబయిపై శుభమన్ గిల్(75), క్రిస్​ లిన్(54), రసెల్​(80) చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు. 12 మ్యాచ్​లలో 486పరుగులు చేసిన రసెల్ భీకరమైన ఫామ్​లో ఉన్నాడు. మరోసారి అతడు బ్యాట్​ ఝుళిపించాలని కోల్​కతా అభిమానులు ఆశిస్తున్నారు. బ్యాటింగ్​లో బలంగా కనిపిస్తున్నా.. బౌలింగ్​లో కాస్త బలహీనంగా ఉంది కోల్​కతా. నరైన్, పియూష్ చావ్లా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. పంజాబ్​తో పోల్చుకుంటే రన్​రేట్​లో కొంచెం మెరుగ్గా ఉంది నైట్​రైడర్స్​.

బ్యాటింగ్​లో రాహుల్​, గేల్​పైనే ఎక్కువ ఆధారపడుతోంది పంజాబ్​. 12 మ్యాచ్​లలో రాహుల్​ 520 పరుగులు చేయగా.. గేల్ 448 రన్స్​తో రాణించాడు. మిడిల్​ ఆర్డర్​లో మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ ఆకట్టుకోవాల్సి ఉంది. బౌలింగ్​లో అశ్విన్, షమి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్​లో ఓడితే పంజాబ్​ ప్లే ఆఫ్​కు దూరమయ్యే అవకాశముంది. సొంతగడ్డపై మ్యాచ్​ జరగనుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

జట్లు... (అంచనా)

కోల్​కతా నైట్​ రైడర్స్​..

దినేశ్​ కార్తీక్(కెప్టెన్, కీపర్), శుభ్​మన్ గిల్​, క్రిస్ ​లిన్​, రసెల్, సునిల్ నరైన్, ఉతప్ప, నితీశ్ రాణా, రింకూ సింగ్, పియూష్ చావ్లా, సందీప్ వారియర్, హ్యారీ గుర్నే.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్​..

రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), లోకేశ్ రాహుల్, క్రిస్​ గేల్​, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, సిమ్రన్ సింగ్(కీపర్), మురుగన్ అశ్విన్, ముజిబర్ రహమాన్, షమి.

Last Updated : May 3, 2019, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details