తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్యాట్ గాల్లోకి విసిరిన పొలార్డ్​కు జరిమానా - ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​లో పొలార్డ్​కు జరిమానా

ముంబయి ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్​కు ఐపీఎల్ తుదిపోరులో జరిమానా పడింది. బ్రావో బౌలింగ్​లో అతడు వ్యవహరించిన తీరుపై రిఫరీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్​ ఫీజులో 25 శాతం కోత విధించాడు.

ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​లో పొలార్డ్​కు జరిమానా

By

Published : May 13, 2019, 11:06 AM IST

హైదరాబాద్​ వేదికగా జరిగిన ఐపీఎల్-12 ఫైనల్​లో ముంబయి జయకేతనం ఎగరవేసింది. నాలుగోసారి కప్పు గెల్చుకుంది. కానీ ఈ పోరు​లో పొలార్డ్​ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 నేరం కింద అతడి మ్యాచ్​ ఫీజులో 25% కోత విధించారు.

అసలేం జరిగిందంటే..?

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్​ చేసింది ముంబయి ఇండియన్స్. క్రీజులో పొలార్డ్ ఉన్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్​ వేస్తున్నాడు చెన్నై బౌలర్ బ్రావో. తొలి బంతికి పరుగేమి రాలేదు. తర్వాత వరుసగా రెండు బంతుల్ని ఆఫ్ స్టంఫ్ అవతల వేశాడు. అంపైర్ వైడ్ ఇవ్వలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన పొలార్డ్.. నాలుగో బంతి వేసే క్రమంలో క్రీజు బయటకొచ్చి బ్యాట్​ను గాల్లోకి విసిరాడు. అంపైర్లు అతడి దగ్గరికొచ్చి ఈ విషయమై మాట్లాడారు. మ్యాచ్​లో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ చెప్పారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన పొలార్డ్​ మిగిలిన రెండు బంతుల్ని బౌండరీలకు పంపించాడు. ఈ మ్యాచ్​లో 25 బంతుల్లో 41 పరుగుల చేసి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇది చదవండి: బర్త్​డే రోజు బ్యాట్​ను గాల్లోకి విసిరిన పొలార్డ్​.. !

ABOUT THE AUTHOR

...view details