తెలంగాణ

telangana

ETV Bharat / sports

చిన్నోడే రేపటి సూపర్​కింగ్​ అవ్వొచ్చేమో.! - ఐపీఎల్​

ఐపీఎల్​ చూడటానికి చాలా మంది జనం వస్తుంటారు. అలా వచ్చిన వారు ఒంటికి రంగులు వేసుకుని,  జెండాలు ప్రదర్శిస్తూ తమ అభిమాన జట్టుకు మద్దతు తెలుపుతుంటారు. అలానే మ్యాచ్​ వీక్షించేందుకు వచ్చిన ఓ పిల్లాడు చేసిన పని నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

చిన్నోడే రేపటి సూపర్​కింగ్​ అవ్వొచ్చేమో.!

By

Published : Apr 10, 2019, 6:18 PM IST

చెన్నై సూపర్​కింగ్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ మ్యాచ్​ను వీక్షించేందుకు వచ్చాడొక చిన్న బుడతడు. అందరిలానే తనకు ఇష్టమైన చెన్నై జట్టుకు మద్దతుగా ఓ పోస్టర్​ ప్రదర్శించాడు. అందులో ఇలా రాసి ఉంది.

'ఈరోజు నేను చెన్నై సూపర్​కింగ్స్ జట్టుకు​చిన్నపాటిఅభిమానిని... కానీ, రేపు అదే సీఎస్​కేలో ఓ ఆటగాడిని అవ్వొచ్చు' అంటూ దాని మీద రాసి ఉంది. ఆ వీడియోకు ముగ్ధులైన సీఎస్​కే, ఐపీఎల్..​ వారి అధికారిక ట్విట్టర్లలో ఆ వీడియోను పంచుకున్నారు. అంతే కాకుండా ఆ చిన్నారి అభిమానానికి హలో చెప్పండి అని కోరాయి.

ABOUT THE AUTHOR

...view details