సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగారు హైదరాబాద్ ఓపెనర్లు. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ సేన ముందు ఉంచింది. ఛేదించలేక 113 పరుగులకే ఆలౌటయింది బెంగళూరు. ఈ మ్యాచ్‌లో బెయిర్ స్టో (56 బంతుల్లో 114 పరుగులు ), డేవిడ్ వార్నర్ (55 బంతుల్లో 100* పరుగలు) విధ్వంసంతో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి.
- ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ చేసిన భారీ స్కోరు ఇదే.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఏ జట్టుకైనా ఇది రెండో అత్యధిక స్కోరు. అంతకుముందు 232 పరుగులు చేసిన పంజాబ్ మొదటస్థానంలో ఉంది.
- సీజన్లో బెయిర్ 'షో'...
56 బంతుల్లో 114 ( 12 ఫోర్లు, 7 సిక్సులు) పరుగులు చేసిన బెయిర్‌స్టో ఐపీఎల్లో తొలి శతకాన్ని సాధించాడు.
ఈ ఐపీఎల్ సీజనే బెయిర్‌స్టోకు మొదటిది. తన మూడో మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. మెకల్లమ్, హస్సీ తమ తొలి ఇన్నింగ్స్‌లలోనే శతకాలు కొట్టి స్టో కంటే ముందున్నారు.
- ఒకే ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు...
ఓపెనర్లుగా బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో బెంగళూరు జట్టు బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఇద్దరూ శతకాలతో చెలరేగిపోయారు.
- వార్నర్‌కు ఐపీఎల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. గేల్ 6 శతకాలతో టాప్‌లో ఉన్నాడు.
- ఒకే ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు నమోదవటం ఐపీఎల్లో ఇది రెండోసారి.
ఆటగాళ్లు | జట్టు - ప్రత్యర్థి | వేదిక | సంవత్సరం |
కోహ్లీ, డివిలియర్స్ | ఆర్సీబీ - గుజరాత్ లయన్స్ | బెంగళూరు | 2016 |
డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో | సన్‌రైజర్స్ - ఆర్సీబీ | హైదరాబాద్ | 2019 |
- మెగా భాగస్వామ్యం...