తెలంగాణ

telangana

ETV Bharat / sports

సత్తాచాటారు.. అవార్డులు దక్కించుకున్నారు

ఐపీఎల్​ ఈ సీజన్​లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్​ క్యాప్​ కైవసం చేసుకున్నారు సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఓపెనర్​ డేవిడ్ వార్నర్. ఇలా ఆయా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను అవార్డులు వరించాయి.

మ్యాచ్​

By

Published : May 13, 2019, 12:38 AM IST

Updated : May 13, 2019, 9:55 AM IST

ఐపీఎల్​-12 సీజన్​లో వివిధ విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు అవార్డులు దక్కించుకున్నారు.

ఈ సీజన్​ మొత్తం మీద ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడికిచ్చే ఆరెంజ్​ క్యాప్​ను సొంతం చేసుకున్నాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఆటగాడు డేవిడ్​ వార్నర్​. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికిచ్చే పర్పుల్ క్యాప్​ను చేజిక్కించుకున్నాడు చెన్నై ఆటగాడు ఇమ్రాన్ తాహిర్​.

ఐపీఎల్-12వ సీజన్​ విజేతగా నిలిచింది ముంబయి జట్టు. చెన్నైతో జరిగిన మ్యాచ్​లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

అవార్డులు దక్కించుకున్న ఆటగాళ్లు వీరే...

  • ఆరెంజ్​ క్యాప్​(అత్యధిక పరుగులు) : డేవిడ్​ వార్నర్​ (హైదరాబాద్​​)... 12 మ్యాచుల్లో 692 పరుగులు
  • పర్పుల్​ క్యాప్​ (అత్యధిక వికెట్లు) : ఇమ్రాన్​ తాహీర్​ (చెన్నై)... 14 మ్యాచుల్లో 26 వికెట్లు
  • సూపర్​ స్టైకర్​ ఆఫ్​ ది సీజన్​ : ఆండ్రీ రసెల్​ (కోల్​కతా)... 204.81 స్టైక్​రేట్​
  • ఎమర్జింగ్​ ప్లేయర్​ ఆఫ్​ ది సీజన్​ - శుభ్​మన్​ గిల్​ (కోల్​కతా)
  • స్టైలిష్​ ప్లేయర్​ ఆఫ్​ ది సీజన్​ : కేఎల్​ రాహుల్​ (పంజాబ్​)
  • పర్​ఫెక్ట్​ క్యాచ్​ ఆఫ్​ ది సీజన్​ - కీరన్​ పోలార్డ్​ (ముంబయి)
  • ఫాస్టెస్ట్​ ఫిఫ్టీ : హార్దిక్​ పాండ్య (ముంబయి)
  • ఫెయిర్​ ప్లే అవార్డు : సన్​ రైజర్స్​ హైదరాబాద్​ జట్టు
  • ఉత్తమ గ్రౌండ్​ ట్రోఫీ.. పంజాబ్​(మొహాలీ), హైదరాబాద్​ మైదానాలు
Last Updated : May 13, 2019, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details