తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ 2019: పది రోజుల్లో పలు సంచలనాలు - సంజూ శాంసన్

మన్కడింగ్ వివాదం, అంపైర్ నిర్ణయాలు, సూపర్​ఓవర్ థ్రిల్లింగ్, హ్యాట్రిక్​ వికెట్లు లాంటి సంచలనాలతో తొలి పది రోజులు క్రికెట్ అభిమానులను అలరించింది ఐపీఎల్ 12వ సీజన్​. ఇంకా నెల రోజులపైగా కొనసాగే ఈ పొట్టి ఫార్మాట్​లో మరెన్నీ విశేషాలు నమోదవుతాయో!

ఐపీఎల్ 2019: పది రోజుల్లో పలు సంచలనాలు

By

Published : Apr 3, 2019, 7:00 AM IST

ఐపీఎల్ 2019... ప్రారంభమై అప్పుడే 10 రోజులైంది. ఈ పది రోజుల్లో క్రికెట్ అభిమానులను కిక్ ఎక్కించేసింది. మన్కడింగ్ వివాదం దగ్గరినుంచి అంపైర్ నిర్ణయాల వరకు ఎన్నో సంచలనాలకు వేదికైంది. ఇలాంటి మరికొన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం!

ఐపీఎల్ 2019
  1. చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన తొలి మ్యాచ్​లో బెంగళూరు జట్టు 70 పరుగులకే ఆలౌటైంది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ధోనీ సేన రెండు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
  2. రాజస్థాన్ రాయల్స్​ బ్యాట్స్​మెన్​ జోస్ బట్లర్​ను పంజాబ్ కెప్టెన్ అశ్విన్ మన్కడింగ్ చేయడం వివాదాస్పదమైంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మన్కడింగ్ చేసిన వ్యక్తిగా అశ్విన్ రికార్డుకెక్కాడు.
  3. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో బెంగళూరు చివరి బంతికి ఏడు పరుగులు చేయాలి. ఇలాంటి తరుణంలో ముంబయి బౌలర్​ మలింగ నోబాల్‌ వేశాడు. అంపైన్‌ నో బాల్‌గా ప్రకటించకపోవడం వల్ల విమర్శలు వెల్లువెత్తాయి.
  4. ఈ ఐపీఎల్​ సీజన్​లో రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ సంజూ శాంసన్ తొలి శతకం బాదేశాడు. సన్​రైజర్స్​తో జరిగిన ఈ మ్యాచ్​లో రాజస్థాన్ జట్టు ఓడిపోయింది.
  5. కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ యువ బ్యాట్స్​మెన్ పృథ్వీ షా 99 పరుగులు చేశాడు. శతకానికి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు. ఇదే మ్యాచ్​ టైగా ముగియగా... సూపర్​ఓవర్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టే గెలిచింది. ఈ సీజన్​లో ఇదే తొలి సూపర్​ఓవర్.
  6. రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ ఓపెనర్లిద్దరూ శతకాలు బాదేశారు. ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.
  7. దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్ బౌలర్ సామ్ కరన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ సీజన్​లో ఇదే తొలి హ్యాట్రిక్​. ఇదే మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 పరగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.

సీజన్‌లోని తొలి పది రోజుల్లోనే బిగ్‌ హిట్టింగ్‌, టెర్రిఫిక్‌ బౌలింగ్‌, అద్భుతమైన ఫినిషింగ్‌, మెరుపు సెంచరీలు, కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు అభిమానులను అలరించాయి.

ABOUT THE AUTHOR

...view details