తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అత్యంత పిన్న వయసులో ఐపీఎల్​ అరంగ్రేటం' - రసిక్​ సలామ్​

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​).... యువక్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంలో ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తుంది. ప్రతి ఏటా ఫ్రాంఛైజీలు కొత్త ఆటగాళ్లను తీసుకొస్తున్నాయి. అందులో పిన్న వయస్కులకూ అవకాశం దక్కుతుంది. అలాంటి 16 ఏళ్ల బౌలర్ ప్రయాస్​ రాయ్​ బర్మన్​.. ఈరోజు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తరఫున​ అరంగేట్రం చేశాడు.

ఐపీఎల్​లో అత్యంత పిన్న వయస్కుడి అరంగేట్రం

By

Published : Mar 31, 2019, 5:56 PM IST

ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న లీగ్​లలో ఐపీఎల్​ అగ్ర స్థానంలో ఉంది. ఇందులో రాణిస్తే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికిఆటగాళ్లకుమార్గం సుగమమవుతుంది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను డబ్బు పెట్టి కొనుక్కోవడం ద్వారా వారికి ఆర్థిక భరోసా ఇస్తుంది. వారిలోని నైపుణ్యాన్ని బయటకు తీసేందుకు ఇదో పెద్ద వేదికైంది.

  1. అలాంటి ఈ టోర్నీలో పశ్చిమ్​ బంగాకు చెందిన 'ప్రయాస్​ రాయ్​ బర్మన్​' బెంగళూరు తరఫున అరంగేట్రం చేశాడు. అతడి వయసు 16 సంవత్సరాల 157 రోజులు.
  2. ఈ ఐపీఎల్​లో ముంబయి తరఫున కశ్మీర్​ ఆటగాడు రసిక్​ సలామ్​ సైతం 17 ఏళ్ల 353 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.

ఇతడి కన్నా ముందు...

ప్రస్తుతం భారత క్రికెట్​లో అదరగొడుతున్న ఆటగాళ్లు హార్దిక్​ పాండ్య, బుమ్రా, చాహల్​... ఐపీఎల్​ ద్వారానే పేరు తెచ్చుకున్నారు.

17 సంవత్సరాల 11 రోజుల వయసులో ముజీబ్​ ఉర్​ రెహ్మన్...​ ఐపీఎల్​లో తొలి మ్యాచ్​ ఆడాడు. 17 ఏళ్ల 177 రోజుల వయసులో సర్ఫరాజ్​ఖాన్​, 17 ఏళ్ల 179 రోజులకు ప్రదీప్​ సంగ్వాన్​, 17 ఏళ్ల 199 రోజులకు వాషింగ్టన్​ సుందర్​.. ఐపీఎల్​లో అరంగేట్రం చేశారు.

ABOUT THE AUTHOR

...view details