తెలంగాణ

telangana

ETV Bharat / sports

సూపర్​కింగ్స్​పై సన్​రైజర్స్​ అలవోక విజయం - ipl match 33

హైదరాబాద్​ వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన మ్యాచ్‌లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 133 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

సన్​'రైజ్'​ అయింది...చెన్నైపై 6 వికెట్ల తేడాతో విజయం

By

Published : Apr 17, 2019, 11:50 PM IST

వరుస ఓటములకు చెక్​ పెడుతూ సన్​రైజర్స్​ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 133 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరాబాద్​ ఓపెనర్లు మరోసారి రాణించడం... అర్ధశతకాలతో ఆకట్టుకోవడం వల్ల 16.5 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు వార్నర్​కు లభించింది.

ఓపెనర్లే బలం...

హైదరాబాద్​ జట్టుకు సిరీస్​ మొదటి నుంచి ఓపెనర్లే భరోసాగా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్​లో డేవిడ్‌ వార్నర్‌ (50; 25 బంతుల్లో 10×4) , జానీ బెయిర్‌స్టో (61; 44 బంతుల్లో 3×2, 3×6) పరుగులతో ఆకట్టుకున్నారు. మిడిలార్డర్​ విఫలమైనా బెయిర్​స్టో చివరి వరకు క్రీజులో ఉండి గెలుపు కోసం కృషి చేశాడు.

  • హైదరాబాద్​ తిప్పేసింది...

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న చెన్నైకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. 9 ఓవర్లలోనే 70 పరుగులు జోడించారు. షేన్​ వాట్సన్​ (31; 29 బంతుల్లో 4ఫోర్లు), డుప్లెసిస్‌ (45; 31 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సులు) దూకుడుగా ఆడారు. కాని వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు వేగం తగ్గిపోయింది. సురేశ్‌ రైనా (13) కేదార్‌ జాదవ్‌ (1), బిల్లింగ్స్‌ (0) పరుగులతో నిరాశపరిచారు.

హైదరాబాద్​ బౌలర్లలో రషీద్​ఖాన్​ అద్భుతమైన బౌలింగ్​ వేశాడు. 4 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

తేలిపోయిన చెన్నై బౌలర్లు...

తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్​ను తాహిర్​ కొంచెం ఇబ్బంది పెట్టి విజయాన్ని ఆలస్యం చేశాడు. ఓ దశలో సన్​రైజర్స్​ మిడిలార్డర్​ను ముప్పతిప్పలు పెట్టినా ...బెయిర్​ స్టో విధ్వంసానికి తలవంచక తప్పలేదు.

ABOUT THE AUTHOR

...view details