తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​ హ్యాట్రిక్​ విజయం...దిల్లీపై గెలుపు - ఐపీఎల్​

బౌలింగ్​లోనూ, బ్యాటింగ్​లోనూ సమష్టి ప్రదర్శన చేసి హైదరాబాద్ మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. దిల్లీలోని ఫిరోజ్​ షా కోట్లా మైదానంలో దిల్లీ క్యాపిటల్స్​పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా​ పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో టాప్​ ప్లేస్​లోకి దూసుకెళ్లింది.

సన్​రైజర్స్​ హ్యాట్రిక్​ విజయం...దిల్లీపై 5 వికెట్ల తేడాతో గెలుపు

By

Published : Apr 4, 2019, 11:56 PM IST

130 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్​రైజర్స్​కు ఓపెనర్లు శుభారంభం అందించారు. కొట్టాల్సింది తక్కువే అయినా బెయిర్​ స్టో 28 బంతుల్లో 48 పరుగులతో (9 ఫోర్లు, ఒక సిక్స్​) చెలరేగిపోయాడు. ఇందులో 42 రన్స్​ బౌండరీల ద్వారా వచ్చినవే. మరో​ ఎండ్​లో వార్నర్​ చక్కటి సహకారం అందించాడు. చివర్లో వెంటవెంటనే వికెట్లు పడినా.. నబీ 9 బంతుల్లో 17 పరుగులతో వేగంగా ఆడి జట్టుకు విజయాన్నందించాడు.

ఈ గెలుపుతో హ్యాట్రిక్​ విజయాలు నమోదు చేసింది సన్​రైజర్స్​. అంతకుముందురాజస్థాన్​, బెంగళూరులపై విజయాలను నమోదు చేసింది భువీ సేన. ఫలితంగా... 4 మ్యాచుల్లో 3 విజయాలతోపాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి చేరింది​.

అద్భుత భాగస్వామ్యం​...

ఈ సీజన్​లో ఒక్కసారీ పవర్​ ప్లేలో వికెట్​ కోల్పోని రికార్డున్న హైదరాబాద్​...ఈ మ్యాచ్​లోనూ అదే ఊపు​ కొనసాగించింది. ఓపెనర్లు బెయిర్​ స్టో, వార్నర్​ వరుసగా నాలుగో మ్యాచ్​లోనూ 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అయితే బెయిర్​ స్టో క్యాచ్​లను రెండు సార్లు నేల విడిచారు దిల్లీ ఫీల్డర్లు. కాని చివరికి అర్ధశతకం చేయకుండానే 48 పరుగుల వద్ద ఔటయ్యాడు బెయిర్​ స్టో.

దిల్లీ బౌలర్లందరూ హైదరాబాద్​ బ్యాట్స్​మెన్ల దూకుడు ముందు తేలిపోయారు. పరుగులు నియంత్రించడంలో విఫలమయ్యారు.

  • క్యూ కట్టేశారు...

టాస్​ ఓడి ముందుగా బ్యాటింగ్​ చేసిన దిల్లీ క్యాపిటల్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులకే పరిమితమైంది. రెండు ఫోర్లు కొట్టి మంచి ఆరంభాన్నిచ్చిన పృథ్వీషా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. వెంటనే శిఖర్​ ధావన్​ (12), పంత్​ (5), రాహుల్​ తెవాటియా(5), ఇంగ్రామ్​ (5), మోరిస్​ (17) తక్కువ పరుగులకే ఔట్​ కావడంతో స్కోరు మందగించింది. చివర్లో అక్షర్​ పటేల్​ 17 పరుగుల చేయడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

  • కెప్టెన్​ ఇన్నింగ్స్​..

మంచి బ్యాటింగ్​ లైనప్​గా పేరున్న దిల్లీ జట్టును.. సన్​రైజర్స్​ స్పిన్నర్లు నియంత్రించారు. కెప్టెన్​ శ్రేయస్ అయ్యర్​​ 41 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టుకు పోరాడే స్కోరునందించాడు.

​హైదరాబాద్​ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​ చేశారు. భువనేశ్వర్​, నబీ, కౌల్​ చెరో రెండేసి వికెట్లు తీశారు. రషీద్​ ఖాన్​, సందీప్​ తలో వికెట్​ తీసుకున్నారు. రషీద్​ ఖాన్​ 4 ఓవర్లకు 18 పరుగులిచ్చి పొదుపుగా బౌలింగ్​ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details