తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న కోహ్లీ సేన - ఐపీఎల్​ 2019

హైదరాబాద్​లో జరుగుతున్న మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు​ టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది.

టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న కోహ్లీ సేన

By

Published : Mar 31, 2019, 3:44 PM IST

Updated : Mar 31, 2019, 3:56 PM IST

సన్​రైజర్స్హైదరాబాద్​​తో జరుగుతున్న మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్బెంగళూరుటాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది. హైదరాబాద్​లోని రాజీవ్​ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతోంది.

సొంతగడ్డపై గత మ్యాచ్​లో(రాజస్థాన్​ రాయల్స్​) అద్భుత విజయంతో జోరు మీదున్న హైదరాబాద్​ మరో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. లీగ్‌లో తొలి విజయం కోసం బరిలోకి దిగుతోంది బెంగళూరు జట్టు.


  • వార్నర్​ వర్సెస్​ కోహ్లీ...

ఇరు జట్లలో వార్నర్​, కోహ్లీ ప్రత్యర్థులకు తమ బ్యాటింగ్​తో చుక్కలు చూపించగలరు. వీరిద్దరూ మంచి ఫామ్​లో ఉండి ఐపీఎల్​లో పరుగుల మోత ఆరంభించారు. అయితే ఈ మ్యాచ్​లో ఎంత మేర ప్రదర్శన చేస్తారో చూడాల్సి ఉంది.

  • బెంగళూరులో 16 ఏళ్లఆటగాడు...

ఈ రోజు మ్యాచ్​లో తొలిసారి అరంగేట్రం చేస్తున్నాడు ప్రయాస్​ రాయ్​ బర్మన్​. ఈ బంగాలీ బౌలర్​ను రూ. కోటి 50 లక్షలకు కొనుగోలు చేసింది బెంగళూరు యాజమాన్యం. ఇతడు 16 ఏళ్లకే ఐపీఎల్​ తొలి మ్యాచ్​ ఆడుతుండటం విశేషం.

  • జట్ల అంచనా..

సన్​రైజర్స్ హైదరాబాద్​: డేవిడ్ వార్నర్​, బెయిర్​ స్టో, విజయ్ శంకర్, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, రషీద్ ఖాన్​, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), దీపక్​ హుడా, సందీప్ శర్మ, సిద్ధార్థ్​ కౌల్, షకీబ్ అల్ హసన్,నబీ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:విరాట్ కోహ్లీ(కెప్టెన్), పార్థివ్ పటేల్(కీపర్), మొయిన్ అలీ, డివిలియర్స్​, హిట్మైర్, గ్రాండ్​హోమ్, శివమ్ దుబే, నవ్​దీప్ సైనీ, చాహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్​ సిరాజ్, ప్రయాస్​ రాయ్​ బర్మన్​

Last Updated : Mar 31, 2019, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details