తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాదేసిన విలియమన్స్... బెంగళూరు లక్ష్యం 176 - విలియమ్సన్

బెంగళూరు రాయల్​ ఛాలెంజర్స్​ ముందు 176 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది హైదరాబాద్​ సన్​రైజర్స్​. కెప్టెన్ విలియమన్స్ దూకుడుగా ఆడి 70 పరుగులు చేశాడు.

నిలిచిన విలియమన్స్... బెంగళూరు లక్ష్యం 176

By

Published : May 4, 2019, 9:53 PM IST

బెంగళూరు వేదికగా అతిథ్య జట్టుతో జరుగుతున్న మ్యాచ్​లో నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది హైదరాబాద్ సన్​రైజర్స్​. కెప్టెన్ విలియమన్స్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగింది సన్​రైజర్స్ హైదరాబాద్. ఓపెనర్లు సాహా, గప్తిల్.. తొలి వికెట్​కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం కొద్దిసేపటికే వారిద్దరూ వెనుదిరిగారు. ఫామ్​లో ఉన్న మనీశ్ పాండే కేవలం 9 పరుగులే చేసి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విలియమన్స్ చివరి వరకు నిలిచి 70 పరుగులు చేశాడు.

మిగతా బ్యాట్స్​మెన్​లో విజయ్ శంకర్ 27, యూసఫ్ పఠాన్ 3, నబీ 4, రషీద్ 1, భువనేశ్వర్ 7 పరుగులు చేశారు.

బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీశాడు. సైనీ 2, చాహల్, కుల్వంత్ తలో వికెట్ పడగొట్టారు.

యూసఫ్ పఠాన్ వికెట్ తీసిన చాహల్.. ఐపీఎల్​లో 100 వికెట్లు మార్కు​ను చేరుకున్నాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details