భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఒకే మ్యాచ్‌తో వెలుగులోకి వచ్చాడు ఆస్టన్ టర్నర్. అయితే ఇప్పుడు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఫలితంగా ఓ చెత్త రికార్డును మూటగట్టకున్నాడు. టీ20 చరిత్రలో వరుసగా ఐదుసార్లు డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన టర్నర్ అన్నింటిలోనూ సున్నా పరుగులకే ఔటయ్యాడు.
టర్నర్ డకౌట్లపై నెటిజన్ల విమర్శలు
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఆస్టన్ టర్నర్‌కు విధ్వంసకర ఆటగాడిగా పేరుంది. కాని ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ సున్నాకే ఔటవడం వల్ల అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
గోల్డెన్ డకౌట్ల 'టర్నర్'
అంతకుముందు బిగ్‌బాష్ లీగ్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్‌గానే పెవిలియన్ చేరాడు. ఇందులో నాలుగు సందర్భాల్లో తొలి బంతికే (గోల్డెన్ డక్) ఔట్ కావడం గమనార్హం. హార్డ్ హిట్టర్‌గా పేరుగాంచిన టర్నర్.. ఈ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన ఆటగాళ్లలో తొలి స్థానంలో ఉన్నాడు. సోమవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ టర్నర్ ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే వికెట్ సమర్పించుకుని అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.