క్రికెటర్ ధోని.. కుటుంబ సమేతంగా నేడు ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఐదో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా స్వస్థలం రాంచీలో ఓటు వేశాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో ఓ ఆసక్తికర వీడియోను పంచుకుంది.
ధోని కుమార్తె ఓటు పాఠాలు... నెటిజన్లు ఫిదా! - ఐపీఎల్ 2019
చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో ఆసక్తికర వీడియో పంచుకుంది. 'అమ్మ, నాన్నలా అందరూ ఓటేయండి' అని ధోని కూతురు జీవా ఇందులో చెపుతోంది.
'అమ్మ, నాన్నలా అందరూ ఓటేయండి'
'అమ్మ, నాన్నలా అందరూ తమ ఓటును వినియోగించుకోండి' -ట్విట్టర్లో ధోని కూతురు జీవా
ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నైకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు ధోని. సొంతగడ్డపై ముంబయితో మంగళవారం తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది సీఎస్కే. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళుతుంది. ఓడిన జట్టు క్వాలిఫైయర్-2లో గెలిచిన జట్టుతో మరో మ్యాచ్ ఆడుతుంది.